- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP: రేపు ఈ జిల్లాలకు వర్షసూచన.. మబ్బులు కమ్మితే జాగ్రత్త!
శనివారం రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: శనివారం రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మరో మూడ్రోజులపాటు ఇదే వాతావరణం ఉంటుందని స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు, వడగాల్పులు వీస్తాయని తెలిపారు. శనివారం.. పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూల్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుముల శబ్దం వినిపించగానే ప్రజలు, రైతులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
అలాగే.. రాష్ట్రంలోని 56 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, మరో 15 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ జిల్లాల్లో 42-44 డిగ్రీలు, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సుందని తెలిపారు.






