- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హక్కులు అల్లు అర్జున్‌కే.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
అల్లు అర్జున్ అనుమతి లేకుండా ఆయన పేరు, వాయిస్, ఇమేజ్‌ను ఏఐ, డీప్‌ఫేక్ ద్వారా వాడుతున్న వారిపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ యాక్టర్ అల్లు అర్జున్‌కు (Allu Arjun) ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) ఊరట లభించింది. ఏఐ (Artificial Intelligence), డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి అల్లు అర్జున్ అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, గొంతు, హావభావాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడంపై మంగళవారం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన అనుమతి లేకుండా వాణిజ్య లాభం కోసం వస్తువులలో తన వ్యక్తిత్వ హక్కులను వాణిజ్యపరంగా ఉపయోగించుకోవడానికి ఉపయోగిస్తున్నారని ఈ విషయంలో తన వ్యక్తిత్వ హక్కులు కాపాాడాలంటూ అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్‍పై ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ తుషార్ రావు గెడెల ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా వాణిజ్య ప్రచారం నేరమని సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని న్యాయస్థానం హెచ్చరించింది. అల్లు అర్జున్ పేరు, రూపం, గొంతు, సంభాషణలు, హావభావాలు అన్నీ ఆయనకే చెందిన 'పర్సనాలిటీ రైట్స్' అని కోర్టు స్పష్టం చేసింది. ఇవి ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపునిచ్చే అంశాలని పేర్కొంది. కాగా అల్లు అర్జున్ తరఫున సీనియర్ న్యాయవాది స్వాతి సుకుమార్ మరియు వారి బృందం వాదనలు వినిపించారు.






