ముంబైకి అల్లు అర్జున్ షిఫ్ట్....ఏకంగా లగ్జరీ ఫ్లాట్ తీసుకుని!

by velandi.Saikiran |   (  Updated:2026-04-21 08:57:17  IST  )

ముంబైలోనే లగ్జరీ ఫ్లాట్ అద్దెకి తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట అల్లు అర్జున్.

ముంబైకి అల్లు అర్జున్ షిఫ్ట్....ఏకంగా  లగ్జరీ ఫ్లాట్ తీసుకుని!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బన్నీ.. మొదటి నుంచి అదరగొడుతూనే ఉన్నాడు. స్టార్ హీరోగా మారేందుకు చాలా కష్టపడ్డాడు. గంగోత్రి లాంటి ప్రేమ కథ సినిమా చేసి తెలుగు ప్రేక్షకులను కదిలించాడు. ఆ తర్వాత వరుసగా హిట్స్ అందుకొని, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు అల్లు అర్జున్.

పుష్ప సినిమా తర్వాత ఐకాన్ స్టార్ గా ఎదిగారు. అలాంటి అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్లు టాక్. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ రాకా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బన్నీ. ఈ సినిమా షూటింగ్ ముంబై, విదేశాల్లోనే ఎక్కువగా జరుగుతోంది.

ఈ క్రమంలో ముంబైకి మకాం మార్చాలని నిర్ణయం తీసుకున్నాడట. ఏడాదిగా స్టార్ హోటల్ లోని ఉంటున్న అల్లు అర్జున్, హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాడు. ఈ ట్రావెలింగ్ ఇబ్బందిగా మారడంతో ముంబైలోనే లగ్జరీ ఫ్లాట్ అద్దెకి తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఫ్యామిలీతో గడపడానికి వీలుగా ఉంటుందని అల్లు అర్జున్ భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. దీనిపై ఈ నెల చివ‌ర‌లో క్లారిటీ రానుంద‌ట‌.

సూపర్ స్టార్ బాటలో అల్లు అర్జున్.. ‘రాకా’ రెమ్యూనరేషన్ విషయంలో షాకింగ్ నిర్ణయం

Next Story