సూపర్ స్టార్ బాటలో అల్లు అర్జున్.. ‘రాకా’ రెమ్యూనరేషన్ విషయంలో షాకింగ్ నిర్ణయం

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-21 08:56:25  IST  )

రజనీకాంత్ మొదట తక్కువ అడ్వాన్స్ తీసుకుని, సినిమా సక్సెస్ అయ్యాక వచ్చే లాభాల్లో మేజర్ షేర్ తీసుకుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే బాటలో నడవాలని నిర్ణయించుకోవడం విశేషం.

సూపర్ స్టార్ బాటలో అల్లు అర్జున్.. ‘రాకా’ రెమ్యూనరేషన్ విషయంలో  షాకింగ్ నిర్ణయం
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘రాకా’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో బన్నీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి.. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమాకు వందల కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తుంటారు, కానీ అల్లు అర్జున్ మాత్రం ఈసారి కొత్త రూల్ పాటించబోతున్నారని తెలుస్తోంది.. ప్రస్తుతం భారతీయ సినిమా మార్కెట్ గ్లోబల్ లెవల్‌లో విస్తరిస్తోంది. దీంతో స్టార్ హీరోల పారితోషికాలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో నిర్మాతల మీద భారం తగ్గించడానికి అల్లు అర్జున్ ఒక కీలక అడుగు వేశారని సమాచారం. ‘రాకా’ సినిమా కోసం ఆయన ఫిక్స్‌డ్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా, మూవీ సాధించే లాభాల్లో వాటాతీసుకునే మోడల్‌ను ఎంచుకున్నారట. అంటే సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయితే, బన్నీకి అంత ఎక్కువ లాభం దక్కుతుందన్న మాట.

ఈ తరహా లాభాల భాగస్వామ్య పద్ధతిని ఇప్పటికే టాలీవుడ్‌లో చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు అనుసరిస్తున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇదే పద్ధతిని పాటిస్తారు. ఆయన మొదట తక్కువ అడ్వాన్స్ తీసుకుని, సినిమా సక్సెస్ అయ్యాక వచ్చే లాభాల్లో మేజర్ షేర్ తీసుకుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే బాటలో నడవాలని నిర్ణయించుకోవడం విశేషం. భారీ బడ్జెట్ సినిమాల కాలంలో హీరోలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీకి ఎంతో మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల నిర్మాతలపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, సినిమా విజయంపై హీరోలకు మరింత బాధ్యత పెరుగుతుంది. బన్నీ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాతలకు అండగా నిలుస్తూనే, తన సినిమా కంటెంట్‌పై తనకు ఉన్న నమ్మకాన్ని అల్లు అర్జున్ ఈ రకంగా చాటుకున్నారని అభిమానులు ఖుషీ అవుతున్నారు.అంతేకాకుండా కుర్ర హీరోలకు ఆదర్శంగా నిలిచారని అంటున్నారు.

ముంబైకి అల్లు అర్జున్ షిఫ్ట్....ఏకంగా లగ్జరీ ఫ్లాట్ తీసుకుని!

Next Story