- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిల్లర్ పాత్రలో ఆలియా భట్.. వైరల్ అవుతున్న న్యూస్‌తో ‘ఆల్ఫా’పై భారీ హైప్
యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ‘స్పై యూనివర్స్’ సినిమాల్లో ‘ఆల్ఫా’ ఒకటి.

దిశ, సినిమా: యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ‘స్పై యూనివర్స్’ సినిమాల్లో ‘ఆల్ఫా’ ఒకటి. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ‘ఆల్ఫా’ చిత్రంలో ఆలియా పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట షాకింగ్‌గా వైరల్ అవుతున్నది. ఇప్పటి వరకు వచ్చిన ఈ సిరీస్ సినిమాల్లో హీరోహీరోయిన్స్ స్పై ఏజెంట్స్ కాగా.. ఇందులో మాత్రం అందుకు భిన్నంగా ఆలియాను ఓ పవర్ ఫుల్ ఆల్ఫా కిల్లర్‌గా చూపించబోతున్నట్లు తెలుస్తుంది. కేవలం ప్రత్యర్థులను అంతమొందించడానికి చిన్నప్పటి నుంచి ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఓ ప్రొఫెషనల్ హంతకురాలుగా నెగిటివ్ షేడ్స్‌లో యాంటీ-హీరో పాత్రలో ఆలియా నటిస్తుందటి బాలీవుడ్ వర్గాల నుంచి టాక్. అలాగే ఇందులో ఆమె చేసే భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుయని, ఈ సినిమాతో ఆలియా తన కెరీర్‌లోనే బెస్ట్ సక్సెస్ అందుకుంటుంది ఇన్‌సైడ్ టాక్. కాగా.. ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్ ఫేమ్ శివ రవైల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శర్వారీ వాఘ్ మరో హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం జులై 10న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చెయ్యగా.. ఓ వారం ముందుగా అంటే జులై 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నదని తెలుస్తుంది.






