నన్నే డామినేట్ చేశావంటూ ఆ స్టార్ హీరో ఇప్పటికీ ఆటపట్టిస్తుంటాడు: రకుల్ ప్రీత్ సింగ్

by Mallepaka Hamsa |

ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరికీ ఒక డ్రీమ్ హీరో ఉంటాడని, అలాగే తనకు కూడా రామ్ చరణ్‌తో నటించాలనే బలమైన కోరిక ఉండేదని రకుల్ చెప్పారు. ఆ అవకాశం తనకు ఏకంగా రెండు సార్లు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.

నన్నే డామినేట్ చేశావంటూ ఆ స్టార్ హీరో ఇప్పటికీ ఆటపట్టిస్తుంటాడు: రకుల్ ప్రీత్ సింగ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన సినిమా ‘ధృవ’ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిన ఈ చిత్రాన్ని సురేందర్ తెరకెక్కించారు. సమాజంలో జరిగే నేరాలకు, వ్యవస్థలోని లొసుగులకు కారణమైన పవర్ఫుల్ సైంటిస్ట్, బిజినెస్‌బ్యాన్ క్యారెక్టర్‌లో అరవింద్ స్వామిని ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ రామ్ చరణ్ ఎలా పట్టుకున్నాడనేది ఈ మూవీ స్టోరీ. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్‌సింగ్ ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన పలు విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌పై రకుల్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరికీ ఒక డ్రీమ్ హీరో ఉంటాడని, అలాగే తనకు కూడా రామ్ చరణ్‌తో నటించాలనే బలమైన కోరిక ఉండేదని రకుల్ చెప్పారు. ఆ అవకాశం తనకు ఏకంగా రెండు సార్లు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.

రామ్ చరణ్ అంత పెద్ద గ్లోబల్ స్టార్ అయినప్పటికీ, ఆయనకు ఎలాంటి గర్వం ఉండదని, ఎంతో కల్మషం లేని మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ముఖ్యంగా ‘ధృవ’ సినిమా కోసం చరణ్ పడిన కష్టం, ఆయన బాడీ మేకోవర్ చూసి తానే ఆశ్చర్యపోయానని రకుల్ గుర్తుచేసుకున్నారు. ఇక ఈ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘పరేషానురా’ గురించి రకుల్ ఒక ఫన్నీ విషయాన్ని పంచుకున్నారు. ఆ పాటలో తన గ్లామర్, పర్‌ఫార్మెన్స్ చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ థియేటర్లలో చొక్కాలు చించుకున్నారని.. ఆ సాంగ్‌లో చరణ్ కంటే తనే ఎక్కువగా డామినేట్ చేసేసిందంటూ ఇప్పటికీ చరణ్ తనను సరదాగా ఆటపట్టిస్తుంటారని రకుల్ నవ్వుతూ చెప్పారు. అలాగే ఆ పాటలోని కొన్ని కష్టమైన డ్యాన్స్ మూమెంట్స్ కోసం తాను ఎక్కువ టేకులు తీసుకుని విసిగించినప్పటికీ, రామ్ చరణ్ ఏమాత్రం విసుక్కోకుండా, అంతే ఉత్సాహంతో, ఎంతో ఓపిగ్గా తనతో కలిసి స్టెప్పులు వేశారని చరణ్ గొప్పతనాన్ని రకుల్ ప్రీత్ సింగ్ వివరించారు.

Next Story