- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లవ్ అండ్ వార్’లోకి ఎంట్రీ ఇచ్చిన అలియా భట్
బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ నుంచి వస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘లవ్ అండ్ వార్’.

దిశ, సినిమా: బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ నుంచి వస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘లవ్ అండ్ వార్’. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను విపరీపతంగా ఆకట్టుకోగా.. తాజాగా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ మూవీ 2027 రిపబ్లిక్ డే కానుకగా.. జనవరి 21వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ప్రకటించారు. ఇక రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ అనంతరం చిత్రీకరణలో జోరు పెంచిన చిత్ర బృందం అలియాపై ఓ స్పెషల్ సాంగ్‌ను తెరకెక్కించే పనిలో పడినట్లు టాక్. ఈ మేరకు బాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ‘ఇదొక అద్భుతమైన స్పర్శ.. రణ్‌బీర్‌కపూర్, అలియాభట్, విక్కీకౌశల్ నటిస్తున్న లవ్ అండ్ వార్ చిత్రం వచ్చే వారం ఒక భారీ పాట చిత్రీకరణను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.. ఈ పాటను 50 మందికి పైగా బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌లతో అలియాభట్‌పై చిత్రీకరించనున్నారు.. దీనికి శ్రేయాఘోషల్ గాత్రం అందించారు’ అని పోస్ట్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.






