‘బృందావిహారి’ సినిమాలో మాళవిక.. ఊహించని లుక్ విడుదల చేసిన మూవీ టీమ్

by Mallepaka Hamsa |

లక్ష్యంపై కేంద్రీకరించిన మనసు.. వంగని సంకల్పం.. తనలో తాను ఎన్నడూ ఊహించని అంకితభావం కలిగిన అమ్మాయి మీరా" అంటూ చిత్ర బృందం ఆమె పాత్ర తీవ్రతను వివరించింది.

‘బృందావిహారి’ సినిమాలో మాళవిక.. ఊహించని లుక్ విడుదల చేసిన మూవీ టీమ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం కోసం ప్రయత్నిస్తున్న నటి మాళవిక శర్మ. ‘నేల టిక్కెట్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు, ఆ తర్వాత ‘రెడ్’, ‘భీమా’, ‘హరోం హర’ వంటి చిత్రాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తెలుగు, తమిళం, భాషల్లోనూ నటించినప్పటికీ, ఇప్పటివరకు ఆమెకు ఆశించిన స్థాయిలో స్టార్‌డమ్ రాలేదు. అయితే, ఎప్పుడూ ఒకే రకమైన గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, విభిన్నమైన కథాంశాల వైపు అడుగులు వేస్తోంది. తాజాగా రెండేళ్ల విరామం తర్వాత, మాళవిక ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.మాళవిక శర్మ నటిస్తున్న తాజా సినిమా ‘బృందావిహారి’. ఈ చిత్రంలో ఆమె పోషిస్తున్న పాత్ర పేరు ‘మీరా’. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, తాజాగా మేకర్స్ మాళవిక పాత్రను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "లక్ష్యంపై కేంద్రీకరించిన మనసు.. వంగని సంకల్పం.. తనలో తాను ఎన్నడూ ఊహించని అంకితభావం కలిగిన అమ్మాయి మీరా" అంటూ చిత్ర బృందం ఆమె పాత్ర తీవ్రతను వివరించింది. ఈ పాత్ర కేవలం అందానికి మాత్రమే పరిమితం కాకుండా, భావోద్వేగపూరితమైన లోతును కలిగి ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

ఈ సినిమా నుండి విడుదలైన మాళవిక ఫస్ట్ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో గ్లామర్ పాత్రల్లో కనిపించిన ఈ భామ, ‘బృందావిహారి’లో మాత్రం పూర్తిస్థాయి సంప్రదాయబద్ధంగా పట్టుచీరలో మెరిసిపోతోంది. ఒక నాట్యమయూరిలా ఆమె డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న భంగిమ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె కళ్లలో కనిపిస్తున్న హావభావాలు, ఆ రాజసం, నృత్యంలో ఉన్న లయబద్ధత చూస్తుంటే.. ఈ సినిమాలో క్లాసికల్ డ్యాన్స్‌కు సంబంధించి బలమైన సన్నివేశాలు ఉంటాయని అర్థమవుతోంది. పట్టుచీరలో సంప్రదాయ కళాకారిణిగా మాళవిక చాలా హుందాగా కనిపిస్తోంది. 2024లో ‘హరోం హర’ సినిమా తర్వాతకాస్త గ్యాప్ తీసుకున్న మాళవిక శర్మ, ఇప్పుడు మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఒక నటిగా తనలోని డెప్త్‌ను నిరూపించుకోవడానికి ‘బృందావిహారి’లో ఆమెకు దొరికిన ఈ పాత్ర ఒక మంచి అవకాశం. గ్లామర్ హీరోయిన్‌గా కాకుండా, నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆమె ఆశను ఈ సినిమా నెరవేరుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. నాట్యంతో పాటు బలమైన ఎమోషన్స్ ఉన్న ఈ క్యారెక్టర్ మాళవిక కెరీర్‌ను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.

Next Story