- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య జైనాబ్‌కు క్యూట్ విషెష్ చెబుతూ.. ఆకట్టుకుంటోన్న ఫొటో పంచుకున్న అఖిల్
టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని తన చిరకాల ప్రేయసి జైనాబ్‌ను హైదరాబాద్‌లో హిందూ వేడుకలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని తన చిరకాల ప్రేయసి జైనాబ్‌ను హైదరాబాద్‌లో హిందూ వేడుకలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. . జైనాబ్ సౌదీకి చెందిన వ్యాపారవేత్త జుల్ఫీ రాద్దీ కుమార్తె అయిన జైనాబ్.. అఖిల్‌తో కలిసి ఈ ఏడాది జూన్ 6 వ తారీకున ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. జూబ్లిహిల్స్‌లోని నాగార్జున నివాసంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
పలువురు సినీ ప్రముఖులు అఖిల్ పెళ్లికి హాజరై సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అఖిల్ అండ్ జైనాబ్ రిసెప్షన్ వేడుక అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ కార్యక్రమానికి చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. వీరితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కూడా హాజరై హైలెట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని అన్నపూర్ణ స్టూడియోలు ట్విట్టర్ ద్వారా పంచుకుంది.
ఇకపోతే వీరిద్దరు గత ఏడాదే నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని వీరు నవంబరు 26 వ తేదీన అఖిల్‌తో పాటు తల్లి అమల అండ్ తండ్రి నాగార్జున సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో వెల్లడించారు. ఇదంతా పక్కన పడితే.. అఖిల్.. తన భార్య జైనాబ్ రావ్జీ పుట్టిన రోజు సందర్భంగా క్యూట్ విష్ చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అక్కినేని వారసుడు ‘‘హ్యాపీ బర్త్ డే’’ మై లైఫ్’’ అని ఓ లవ్ సింబల్ కూడా జోడించి ఓ క్యూట్ ఫొటో కూడా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టోరీ వీక్షించిన అక్కినేని అభిమానులు జైనాబ్‌కు పుట్టన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Read More..
కాజల్ అగర్వాల్‌కు ఘోర ప్రమాదం.. అసలు విషయం చెప్తూ షాకింగ్ ట్వీట్






