కాజల్ అగర్వాల్‌కు ఘోర ప్రమాదం.. అసలు విషయం చెప్తూ షాకింగ్ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-09 06:59:40  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌(Kajal Aggarwal)కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

కాజల్ అగర్వాల్‌కు ఘోర ప్రమాదం.. అసలు విషయం చెప్తూ షాకింగ్ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌(Kajal Aggarwal)కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంలో కాజల్ ప్రాణాలు కోల్పోయినట్లు పలు పుకార్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతూ పలు పోస్టులు పెడుతున్నారు. ఆమెను ట్యాగ్ చేస్తూ కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, కాజల్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా యాక్సిడెంట్ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘‘నేను ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి.

అలాగే నేను లేనని కూడా ప్రచారం చేశారు. అందులో వాస్తవం లేదు. నిజం చెప్పాలంటే అవి చూసి నేను చాలా నవ్వుకున్నాను. ఎందుకంటే.. ఇంతకుమించిన ఫన్నీ న్యూస్ ఉండదు. అవన్నీ పూర్తిగా అవాస్తవం. దేవుడి దయ వల్ల నేను క్షేమంగా, సురక్షితంగా ఉన్నాను. అంతేకాకుండా మరింత బాగానే ఉన్నానని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని లేదా ప్రచారం చేయవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ప్రేమ కృతజ్ఞతతో మీ కాజల్’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన అభిమానులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు.

link

Read More..

అది సినిమా మాత్రమే కాదు.. నా జీవితంలో ఓ గొప్ప వరం అంటూ ఆర్జీవీ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్

Next Story