అది సినిమా మాత్రమే కాదు.. నా జీవితంలో ఓ గొప్ప వరం అంటూ ఆర్జీవీ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-09 07:00:25  IST  )

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘రంగీలా’(Rangeela).

అది సినిమా మాత్రమే కాదు.. నా జీవితంలో ఓ గొప్ప వరం అంటూ ఆర్జీవీ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘రంగీలా’(Rangeela). 1995లో వచ్చిన ఈ మూవీతో హీరోయిన్ ఊర్మిళ(Urmila)కు ఫుల్ పాపులారిటీ వచ్చింది.ఒక్కసారిగా అమ్మడు రేంజ్ మారిపోవడంతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన ఆమె వరుస అవకాశాలు అందుకుంది. ఇదిలా ఉంటే..తాజాగా, ‘రంగీలా’ సినిమా వచ్చి నేటితో 30 ఏళ్లు పూర్తి అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘రంగీలా కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. నవరసాల వేడుక. 30 ఏళ్ల క్రితం ఈ మూవీ మీ అందరినీ ఆకర్షించింది. నేటికి అది అదే శక్తితో మిమ్మల్ని ఆ మొదటి క్షణానికి తీసుకెళ్తుంది. నా జీవితంలొ భాగమై నన్ను ప్రేమతో అలింగనం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కలలు కనే ధైర్యాన్ని ఇచ్చి, నన్ను ఒక ప్రత్యేక స్థానంలో నిలిపిన మీ మద్దతు నా జీవితంలో గొప్ప వరం లాంటిది’’ అని రాసుకొచ్చింది. అలాగే ఓ వీడియోను కూడా షేర్ చేసి అందరినీ మైమరపించింది. రంగీలారే ఐకానిక్ పాటను స్టెప్పులేస్తూ అభిమానులు మళ్లీ మాజిక్‌లోకి తీసుకెళ్లింది. ఇక అది చూసిన నెటిజన్లు ఆమె అందం, అభినయం గురించి పొగుడుతున్నారు.

Read More..

భార్య జైనాబ్‌‌కు క్యూట్ విషెష్ చెబుతూ.. ఆకట్టుకుంటోన్న ఫొటో పంచుకున్న అఖిల్

Next Story