అది నా జీవితంలో డిలీట్ చేసిన చాప్టర్.. బ్రేకప్‌పై స్పందించిన హీరోయిన్

by Chukka Sudharani |   (  Updated:2025-08-29 15:59:52  IST  )

శిల్పా శెట్టి సోదరిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి షమితా శెట్టి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన బ్రేకప్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

అది నా జీవితంలో డిలీట్ చేసిన చాప్టర్.. బ్రేకప్‌పై స్పందించిన హీరోయిన్
X

దిశ, సినిమా: శిల్పా శెట్టి సోదరిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి షమితా శెట్టి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన బ్రేకప్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈమె 2021లో మరోసారి బిగ్ బాస్ OTTతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పుడు ఉన్న వాతావరణంలో బిగ్ బాస్ చాన్స్ మంచిగా వచ్చిందంటూ హౌస్‌లోకి వెళ్లిన ఈ అమ్మడు అక్కడ షమితా రాకేష్ బాపత్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అప్పట్లో వాళ్లిద్దరూ బాగా వైరల్ అవుతూ పాపులర్ అయ్యారు. ఇక ఇటీవల ఈ జంట బ్రేకప్ కూడా చెప్పేసుకుని అందరికి షాక్ ఇచ్చారు.

అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి షమితా శెట్టి రాకేష్ బాపత్‌తో విడిపోవడంపై మాట్లాడుతూ.. ‘దయచేసి మీరు అర్థం చేసుకోండి.. ఎక్కువ రోజులు మనం ఓ ఇంట్లో బంధించబడినప్పుడు.. అలాంటి సంబంధాలకు తొందరగా కనెక్ట్ అవుతాము. అయితే బయటకు వచ్చిన తర్వాత అది పూర్తిగా మారిపోతుంది. అయినా.. అది నా జీవితం నుండి డిలీట్ చేసిన చాప్టర్.. దాని గురించి ఎక్కువగా మాట్లాడాలి అనుకోవడం లేదు.. ప్రస్తుతం ఒంటరిగా ఉండటం సంతోషంగా ఉంది. అయతే.. నా ఆత్మను నిజంగా గౌరవించే వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను’ అని తెలిపింది. లింక్

Bigg Boss: అది అంత గొప్ప వాతావరణం కాదు.. బిగ్‌బాస్ హౌస్‌పై నటి షాకింగ్ కామెంట్స్

Next Story