- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bigg Boss: అది అంత గొప్ప వాతావరణం కాదు.. బిగ్‌బాస్ హౌస్‌పై నటి షాకింగ్ కామెంట్స్
శిల్పా శెట్టి సోదరి, నటి షమితా శెట్టి.. బిగ్‌బాస్ ద్వారా బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది.

దిశ, సినిమా: శిల్పా శెట్టి సోదరి, నటి షమితా శెట్టి.. బిగ్‌బాస్ ద్వారా బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఒకసారి కాదు, రెండుసార్లు పాల్గొన్న కొద్దిమంది ప్రముఖులలో ఒకరుగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆమె మొదటిసారి 2009లో అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన సీజన్‌లో పాల్గొంది. తర్వాత 2021లో బిగ్ బాస్ OTTతో షోకి తిరిగి వచ్చింది. ఆ టైమ్‌లో అక్కడ ఎన్నో నేర్చుకున్నానంటూ చెప్పుకొచ్చింది షమితా. ‘బిగ్‌బాస్ షో నాకు చాలా ఇచ్చింది. బయట ప్రపంచంలో ఎలా ఉండాలో నేర్పించింది. ఎందుకంటే.. అక్కడ ఎవరు ఎక్కువ కాలం నటించలేరు. మనలో ఉన్న మంచి, చెడులు కచ్చితంగా బయటకు వస్తాయి. అలాగే అక్కడ ఇంట్లో గడిపిన సమయం నా వ్యక్తిత్వాన్ని చాలా ప్రభావితం చేసింది. నేను బయటకు వచ్చాక కూడా కొంచెం దూకుడుగా మారాను. చిన్న చిన్న విషయాలకు నిత్యం ఇంట్లో గొడవపడేదాన్ని. అది అంత గొప్ప వాతావరణం కాదు. ఎందుకంటే మిమ్మల్ని మానసికంగా కలవరపెడుతుంది’ అని తెలిపింది.






