‘పెళ్లి చేసుకోవడానికి కేవలం వయసుంటే సరిపోదు’.. సినీ నటి ప్రగతి ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-26 12:32:41  IST  )

‘పెళ్లి చేసుకోవడానికి కేవలం వయసుంటే సరిపోదు’.. సినీ నటి ప్రగతి ఆసక్తికర వ్యాఖ్యలు

‘పెళ్లి చేసుకోవడానికి కేవలం వయసుంటే సరిపోదు’.. సినీ నటి ప్రగతి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటి ప్రగతి(Actress Pragathi) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనేక చిత్రాల్లో తల్లి పాత్రల్లో నటించి మెప్పించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ సహా ఇతర భాషల్లోనూ రాణించింది. తాజాగా ఆమె ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకోవడానికి కేవలం వయసుంటే సరిపోదు.. చాలా మెచ్చురిటీ ఉండాలని అన్నారు. ముఖ్యంగా ఒకరిపై ఒకరికి గౌరవం, ఒకరిపై ఒకరికి నమ్మకం, అవగాహన ఈ మూడూ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఒకరిపై ఒకరికి గౌరవం, నమ్మకం లేని చోట ఏ బంధం కూడా నిలబడదని తెలిపారు. ఒకరి ఆలోచనలను మరొకరు అర్థం చేసుకునే గుణం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఇటీవలే పవర్‌ లిఫ్టింగ్‌ సాధన చేసి ప్రపంచ స్థాయిలో పతకాలు సాధించి దేశ గౌరవాన్ని పెంచారు ప్రగతి. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించారు.

Read More : ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేసిన అనసూయ.. థ్యాంక్యూ శివాజీ మీరు దేవుడంటూ నెటిజన్స్ కామెంట్స్

Next Story