కొందరి దుస్తులే కాషాయం కానీ వాళ్ల పిల్లలకు బాప్టిజం ఇప్పిస్తారు.. నటి పూనమ్ కౌర్ సంచలన పోస్ట్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-25 07:26:15  IST  )

టాలీవుడ్ న‌టి పూనమ్ కౌర్ మ‌రోసారి సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌న పోస్ట్ పెట్టింది. కొంత‌మంది దుస్తుల్లో మాత్ర‌మే హిందూయిజంను ఫాలో అవుతార‌ని పేర్కొంది.

కొందరి దుస్తులే కాషాయం కానీ వాళ్ల పిల్లలకు బాప్టిజం ఇప్పిస్తారు.. నటి పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ న‌టి పూనమ్ కౌర్ మ‌రోసారి సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌న పోస్ట్ పెట్టింది. కొంత‌మంది దుస్తుల్లో మాత్ర‌మే హిందూయిజంను ఫాలో అవుతార‌ని పేర్కొంది. కానీ వాళ్ల పిల్ల‌ల‌కు మాత్రం కేవ‌లం 3 నెల‌ల వ‌య‌సులోనే కాథోలిక్ చ‌ర్చిలో బాప్టిజం ఇప్పిస్తార‌ని ఆరోపించింది. మేము ఎప్పుడూ మా వార‌సత్వాన్ని మార్చుకోలేదు.. కానీ పురాత‌న‌మైన కాపు క‌మ్యూనిటీ వార‌స‌త్వాన్ని పూర్తి క్యాథ‌లిక్ క్రిస్టియ‌నిటీలోకి మార్చేస్తాం.. మ‌త మార్పిడికి అంబాసెడ‌ర్... అంటూ పోస్టులో పేర్కొంది. పూన‌మ్ కౌర్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

పూనమ్ ఇలాంటి పోస్టులు పెట్టడం కొత్తేమి కాదు. గత కొన్నేళ్లుగా ఇలాంటి పోస్టులు పెడుతూనే ఉంది. అయితే పూనమ్ చేసే పోస్టులు పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నా దానికి కూడా ఎప్పుడూ సరైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ నెటిజన్లు మాత్రం పవన్, త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూనే పూనమ్ కౌర్ పోస్టులు పెడుతుందని కామెంట్స్ లో వాళ్ల పేర్లును ప్రస్తావిస్తుంటారు. అంతే కాకుండా ఏదైనా ఉంటే బయటకు వచ్చి క్లారిటీగా చెప్పాలని, అన్యాయం జరిగితే ఏం అన్యాయం జరిగిందో తెలపాలని అంటున్నారు. మరోవైపు ఇలాంటి పోస్టులు పెట్టడం రీచ్, అటెన్షన్ కోసమేనని పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

కోట్ బటన్స్ విప్పేసి హీట్ పెంచుతున్న కీర్తి సురేష్.. ఈ డోస్ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు

Next Story