- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
52 ఏళ్లలోనూ సూపర్ ఫిట్..సీక్రెట్ చెప్పిన హీరోయిన్ !
52 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా సీనియర్ నటి ఆమని చాలా ఫిట్ గా కనిపిస్తారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో నటి ఆమని ఒకరు. అప్పట్లో హీరోయిన్ గా దూసుకు వెళ్లిన ఆమని, తన రీ-ఎంట్రీలో తల్లి పాత్రలలో కనిపిస్తున్నారు. ఇటు రాజకీయాల్లో కూడా ఆమె కొనసాగుతున్నారు. అయితే అలాంటి 52 ఏళ్ల సీనియర్ నటి ఆమని తన హెల్త్ సీక్రెట్ బయటపెట్టారు.
నా హెల్త్ సీక్రెట్ అదే.. ఆమని కామెంట్స్ వైరల్
52 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా సీనియర్ నటి ఆమని చాలా ఫిట్ గా కనిపిస్తారు. అయితే ఇలా ఫిట్ గా ఉండటం వెనుక సీక్రెట్ ను తాజాగా రివీల్ చేశారు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని తాను పాటిస్తున్నానని వివరించారు. ఉదయం లేవగానే పూజకు సిద్ధమవుతానని తెలిపారు. సహస్రనామ పారాయణం చదువుతానని వెల్లడించారు. పూజ కాగానే యోగా చేస్తానని తెలిపారు. రెండు పూటలు లిమిట్ గానే ఫుడ్ తీసుకుంటానని చెప్పుకొచ్చారు. మాంసాహారం అద్భుతంగా వండుతాను కానీ, ఇప్పటి వరకు తినలేదని వివరించారు. టైం టు టైం తినడంతోపాటు... పడుకుంటానని చెప్పారు. దానివల్ల ఆరోగ్యంగా ఉంటామని వ్యాఖ్యానించారు.






