- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూలై 5న ఆమిర్ ఖాన్ మూడో వివాహం.. గౌరీ స్ప్రాట్‌తో కొత్త జీవితానికి శ్రీకారం
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన భాగస్వామి గౌరీ స్ప్రాట్ ను జూలై 5న వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.

దిశ, డైనమిక్ బ్యూరో: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) తన భాగస్వామి గౌరీ స్ప్రాట్ (Gauri Spratt)ను జూలై 5న వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఈ వివాహ వేడుకను అత్యంత నిరాడంబరంగా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ మీడియా సమాచారం ప్రకారం, జూలై 5న ముంబైలోని ఆమిర్ ఖాన్ నివాసంలోనే ఈ పెళ్లి జరగనుంది. ఎలాంటి ఆర్భాటాలకు తావులేకుండా రిజిస్టర్ మ్యారేజ్ రూపంలో వీరు ఒక్కటి కానున్నారు. ఇప్పటికే వివాహ ఏర్పాట్లు ప్రారంభమైనట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రైవేట్ వేడుకకు బాలీవుడ్ స్టార్‌లు సల్మాన్ ఖాన్ (Salman Khan), షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ ఆమిర్‌కు అత్యంత సన్నిహిత మిత్రులు కావడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
బ్రిటిష్ కమ్యూనిస్ట్ ఫిలిప్ స్ప్రాట్ మనవరాలు..
గౌరీ స్ప్రాట్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న బ్రిటిష్ కమ్యూనిస్ట్ ఫిలిప్ స్ప్రాట్ మనవరాలు. ఆమెకు గత వివాహం ద్వారా క్విన్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇక ఆమిర్ ఖాన్‌కు ఇది మూడో వివాహం కానుంది. గతంలో ఆయన రీనా దత్తా (Reena Dutta)ను వివాహం చేసుకోగా, వారికి జునైద్, ఐరా అనే ఇద్దరు సంతానం ఉన్నారు. అనంతరం కిరణ్ రావు (Kiran Rao)ను వివాహం చేసుకున్న ఆమిర్‌కు ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే 2021లో ఆమిర్, కిరణ్ రావు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, గతేడాది ముంబైలో జరిగిన తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆమిర్ ఖాన్ తొలిసారిగా గౌరీని మీడియాకు పరిచయం చేశారు. ఇరు కుటుంబాల పూర్తి మద్దతుతో వీరు తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.






