- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్‌ని కలిసిన ఖుష్బూ.. ఇది చాలా ప్రత్యేకమంటూ ఎమోషనల్ పోస్ట్
విజయ్‌ని కలవడం తమ కుటుంబానికి చాలా ప్రత్యేకమైన రోజు అని తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి విజయ్‌ని తన సోదరుడిగా భావిస్తున్నట్లు.. తన కూతుళ్లు ఆయనని చూసి ఎంతో ఉత్సాహానికి గురయ్యారని అన్నారు.

దిశ, సినిమా: సీనియర్ హీరోయిన్, రాజకీయ నేత ఖుష్బూ, ప్రముఖ దర్శకుడు సుందరి సి దంపతుల పెద్ద కూతురు అవంతిక త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకలకు ఈ దంపతులు ప్రముఖులకు ఆహానాలు అందజేస్తున్నారు. ఇటీవల ప్రధాని మోడీని ప్రత్యేకంగా కలిసి అనంతిక పెళ్లి ఆహ్యానం అందించగా.. తాజాగా, తమిళనాడు సీఎం విజయ్‌ను కలిశారు. ఆయన నివాసానికి వెళ్లిన ఖుష్బూ కుటుంబ సభ్యులు అనంతిక, కాబోయే అల్లుడు శ్రవణ్ శ్రీనివాసన్ ల వివాహ పత్రికను ఆయనకు అందజేసి ఆశీస్సులు పొందారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఖుష్బూ సోషల్ మీడియా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. విజయ్‌ని కలవడం తమ కుటుంబానికి చాలా ప్రత్యేకమైన రోజు అని తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి విజయ్‌ని తన సోదరుడిగా భావిస్తున్నట్లు.. తన కూతుళ్లు ఆయనని చూసి ఎంతో ఉత్సాహానికి గురయ్యారని అన్నారు.
ఆయన గడిపిన క్షణాలను ఆస్వాదించారని.. తన బిజీ షెడ్యూల్‌లోనూ విజయ్ ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో స్వాగతించారని పేర్కొన్నారు. ఎప్పటిలాగే తన చిరునవ్వుతోనే తమని ఆత్మీయంగా పలకరించారని వెల్లడించారు. విజయ్ అందించిన ఆశీర్వాదాలు, ప్రేమాభిమానాలు తమ కుటుంబానికి ఎంతో విలువైనవి అని ఎమోషనల్ అయ్యారు. చివరగా విజయ్‌కి ధన్యవాదాలు కూడా తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా.. అనంతిక విషయానికొస్తే.. ఆమె ‘ఆరంభం’ చిత్రంతో త్వరలోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీతో పాటు ఈ అమ్మడు మరో ప్రాజెక్ట్‌లోనూ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ధనుష్ మేనల్లుడు పవీష్ సరసన అనంతిక నటించనున్నట్లు గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్‌గా మారాయి. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందే పెళ్లి చేసుకుంటుండటంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.






