- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aamir Khan: అప్పుడు నా గుండె ముక్కలైంది.. దాంతో మందుకు బానిసయ్యాను
అమీర్ ఖాన్ మాట్లాడుతూ... నా మొదటి భార్య రీనా దత్ ఇంటి నుండి వెళ్లిపోయిన సమయంలో నేను తీవ్రంగా బాధపడ్డాను. ఆ బాధను తట్టుకోలేక కొంతకాలం మద్యంకు బానిసనయ్యానని వెల్లడించాడు.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా చాలామంది స్టార్ హీరోలకు పెద్దగా కష్టాలు ఉండవు, వారికి కావాల్సినంత డబ్బు ఉంటుంది. దాంతో వారి జీవితం ఎంతో ఆనందంగా ముందుకు సాగుతుందని భావిస్తూ ఉంటారు. కానీ ఎవరి కష్టాలు వారికి ఉంటాయి. స్టార్ హీరోలు కూడా కొన్నిసార్లు వ్యక్తిగత జీవితంలో తీవ్ర బాధలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వారిలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్‌గా పేరుపొందిన అమీర్ ఖాన్ ఒకరు. ఈయన కూడా ఒకానొక సమయంలో వ్యక్తిగత జీవితంలో ఎదురైన బాధను తట్టుకోలేక మద్యంకు బానిస అయినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
అమీర్ ఖాన్ మాట్లాడుతూ... నా మొదటి భార్య రీనా దత్ నా ఇంటి నుండి వెళ్లిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఆమె అలా వెళ్లిపోవడంతో నా గుండె ముక్కలు అయినట్లు అనిపించింది. ఆ బాధను తట్టుకోలేక నేను మద్యంకు బానిసనయ్యాను. అయినా కూడా నా బాధ తగ్గలేదు. పిల్లల జీవితం ఎలా ఉంటుంది అనే ఆలోచన నన్ను మరింత కలవరపరిచింది. నేను పూర్తిగా మద్యంకు బానిసనైతే వారి జీవితం కూడా అస్తవ్యస్తం అవుతుందని అనిపించింది. దాంతో వెంటనే మద్యం మానేయాలని నిర్ణయం తీసుకున్నాను, అనుకున్నట్లే ఆ అలవాటుకి దూరం అయ్యాను. ఆ తర్వాత కొంతకాలానికి ఆ బాధ నుండి బయటపడ్డానని ఈ నటుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.






