- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంధ్య థియేటర్ లో దారుణం..మహిళల వాష్‌రూంలో వీడియోలు తీసి !
బెంగళూరులోని మాడివాళ సంధ్య థియేటర్ లో దారుణ సంఘటన జరిగింది. లేడీస్ వాష్ రూమ్ లో రహస్యంగా వీడియోలు చిత్రీకరించి, అడ్డంగా దొరికిపోయాడు ఓ దుర్మార్గుడు.

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులోని మాడివాళ సంధ్య థియేటర్ లో దారుణ సంఘటన జరిగింది. లేడీస్ వాష్ రూమ్ లో రహస్యంగా వీడియోలు చిత్రీకరించి, అడ్డంగా దొరికిపోయాడు ఓ దుర్మార్గుడు. అతడు ఆ థియేటర్ లో పనిచేసే వ్యక్తి కావడం అందరిని షాకింగ్ కు గురి చేస్తోంది. ఈ సంఘటన ఆదివారం రోజున చోటుచేసుకుంది. బెంగళూరులో కూడా తెలుగు అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు సినిమా రీ- రిలీజ్ చేశారు.
ఈ సినిమా బెంగళూరులోని సంధ్య థియేటర్ లో కూడా ఆడుతోంది. జనవరి 4వ తేదీన ఆదివారం కావడంతో చాలా మంది ఈ సినిమాకు వెళ్లారు. ఈ సందర్భంగా లేడీస్ టాయిలెట్స్ లో సీక్రెట్ కెమెరాను ఉంచి వీడియోలు చిత్రీకరిస్తున్నాడట థియేటర్ కు సంబంధించిన ఓ వ్యక్తి. ఇది గమనించిన మహిళలు కేకలు వేశారు. దీంతో థియేటర్ కు వచ్చిన జనాలందరూ ఆ దుర్మార్గుడిని పట్టుకొని చితకబాదారు. అనంతరం మడివాళ పోలీసులకు ఆ నిందితుడిని అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లిక్
Read More..






