- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్యకు సరికొత్త లుక్.. క్రేజీ హెయిర్ స్టైలిస్ట్‌ను రంగంలోకి దించిన కొరటాల
బాలయ్యను సరికొత్త లుక్‌లో చూపించేందుకు ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హాకిమ్‌ను దర్శకుడు కొరటాల శివ రంగంలోకి దించినట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణ దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో చూపించేందుకు కొరటాల శివ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హాకిమ్‌ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.
పలువురు స్టార్ హీరోలకు ప్రత్యేక హెయిర్ స్టైల్స్ డిజైన్ చేసిన ఆయన ప్రస్తుతం బాలయ్య కోసం ప్రత్యేక లుక్‌ను సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలయ్య కొత్త మేకోవర్‌కు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఆయనను పూర్తిగా కొత్త అవతారంలో చూడబోతున్నామనే ప్రచారం ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచుతోంది. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో పాటు కొరటాల శివ సినిమాను కూడా త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.






