‘పెద్ది’ జపాన్ హక్కులు దక్కించుకున్న ప్రముఖ సంస్థ

by Pulgam srinivas |

పెద్ది జపాన్ విడుదల హక్కులను ఇండ్డేగా (INDDEIGA) సంస్థ దక్కించుకుంది.

‘పెద్ది’ జపాన్ హక్కులు దక్కించుకున్న ప్రముఖ సంస్థ
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జపాన్‌లో సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో చరణ్‌కు అక్కడ విశేషమైన గుర్తింపు లభించింది. అనంతరం ఆయన నటించిన ‘రంగస్థలం’ చిత్రాన్ని కూడా జపాన్‌లో విడుదల చేయగా, ఆ సినిమా కూడా మంచి వసూళ్లను రాబట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘పెద్ది’ సినిమాపై కూడా జపాన్‌లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించగా, అదే తేదీన జపాన్‌లో కూడా విడుదల చేయనున్నట్లు తాజాగా వెల్లడించారు.

ఈ సినిమా జపాన్ విడుదల హక్కులను ఇండ్డేగా (INDDEIGA) సంస్థ దక్కించుకుంది. జపాన్‌లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’, ‘రంగస్థలం’ చిత్రాల ద్వారా రామ్ చరణ్‌కు అక్కడ మంచి క్రేజ్ ఏర్పడడంతో ‘పెద్ది’ చిత్రానికి మంచి టాక్ వస్తే జపాన్ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించారు.




Next Story