- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ ఫ్యాన్స్‌కు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. పవర్ ఫుల్ లుక్‌తో ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ప్రకటించిన దర్శకుడు
ఫ్యాన్స్ ఆకలిని గుర్తిస్తూ దర్శకుడు హను రాఘవపూడి తాజాగా ఒక ఊహించని బిగ్ అప్‌డేట్ ఇచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా భారీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటైడ్ సినిమాల్లో ‘ఫౌజీ’ ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేమ, దేశభక్తి, యుద్ధం కలగలిసిన ఒక అద్భుతమైన కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. స్వాతంత్ర్య పోరాట సమయంలో తిరుగుబాటుదారుడిగా మారిన ఒక బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికుడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలో డార్లింగ్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన చిత్రబృందం, మొదట్లో ఒక చిన్న పోస్టర్ షేర్ చేసి ఆ తర్వాత కాస్త సైలెంట్ అయిపోయింది. దీంతో ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.
కనీసం ఒక పోస్టర్ అయినా విడుదల చేయాలంటూ సోషల్ మీడియాలో నిత్యం రిక్వెస్ట్‌లు పెట్టడం మొదలుపెట్టారు. ఫ్యాన్స్ ఆకలిని గుర్తిస్తూ దర్శకుడు హను రాఘవపూడి తాజాగా ఒక ఊహించని బిగ్ అప్‌డేట్ ఇచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ సినిమాను ఈ ఏడాది 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2026 డిసెంబర్ 3 నుండి 'ఫౌజీ' యాత్ర థియేటర్లలో ప్రారంభం కానుందని ఆయన స్పష్టం చేశారు.కేవలం వెండితెరపైనే కాకుండా.. ధైర్యం, గౌరవం, స్వేచ్ఛను నమ్మే ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయే ఒక అద్భుతమైన కథను చూడటానికి సిద్ధంగా ఉండాలంటూ హను రాఘవపూడి చెప్పుకొచ్చారు. ఈ రిలీజ్ డేట్ ప్రకటనతో పాటు ప్రభాస్ కొత్త లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ ఒళ్లంతా రక్తంతో తడిసి ముద్దయి, చేతిలో ఒక పెద్ద తుపాకి పట్టుకుని శవాల మధ్యలో కూర్చుని చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఈ మాస్ లుక్ ప్రభాస్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. సినిమాపై అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు అస్సలు ఊహించలేదని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే డార్లింగ్ లుక్ అదిరిపోయిందని అంటున్నారు.
మహేష్ ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్.. ఆ తేదీన 'పోకిరి' మిడ్‌నైట్ షోలు






