- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లవర్స్‌కి పండగే.. వాలెంటెన్స్ డే స్పెషల్‌గా రామ్ చరణ్ మూవీ రీరిలీజ్..
రామ్ చరణ్ నటించిన సినిమాల్లో'ఆరెంజ్' మూవీ ఒకటి. ఈ సినిమా అప్పట్లో భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్ నటించిన సినిమాల్లో'ఆరెంజ్' మూవీ ఒకటి. ఈ సినిమా అప్పట్లో భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మూవీ ప్లాప్‌గా నిలిచింది. కానీ 'ఆరెంజ్' మూవీ అప్పటి యూత్, మెగా ఫ్యాన్స్‌కి ప్రత్యేకమనే చెప్పాలి. భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్, జెనిలియా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం 2010 నవంబర్ 26న విడుదలైంది. అయితే ఆ తర్వాత కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకోలేకపోయింది.
దీంతో ప్లాప్‌గా నిలిచిన ఈ చిత్రం లవర్స్‌కి, యాత్‌కి మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా పాటలతో సంగీత ప్రియులను అలరించిన ఆరెంజ్ మూవీ ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లోకి తీసుకువస్తున్నట్టు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు.
ఇక ఈసారి ఏకంగా ప్రేమికుల రోజు సందర్భంగా ఆరెంజ్ మూవీ మళ్లీ థియేటర్లోకి వస్తుండటంతో ఈ వాలంటైన్స్ డే లవర్స్‌కి మరింత ప్రత్యేకంగా నిలవనుంది. దీంతో మూవీ లవర్స్, మెగా అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమికులకు, యూత్‌కి పర్ఫెక్ట్ సినిమాని అందిస్తున్నారంటూ మూవీ టీంకి థ్యాంక్స్ చెబుతున్నారు. కాగా ఈ సినిమా మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Read More..






