- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Varun Tej: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. VT-15నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన వరుణ్
మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej)కు గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో విజయాలు అందడం లేదు.

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej)కు గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో విజయాలు అందడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ మాత్రం ఆయన ఖాతాలో పడలేదు. దీంతో అభిమానులు కొద్దిగా నిరాశలో ఉన్నా, వరుణ్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కొత్త ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘VT-15’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. షూటింగ్ పనుల్లో పాల్గొంటూనే, మరోవైపు తన కొడుకు వాయు, భార్య లావణ్యతో కలిసి కుటుంబ సమయాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండటంతో పాటు, అధికారిక ప్రకటన వెలువడిన నాటి నుంచే ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ఆసక్తికరమైన పోస్టర్ విడుదల కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఎప్పుడెప్పుడు కొత్త అప్డేట్స్ వస్తాయా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో వరుణ్ తేజ్ స్వయంగా ఓ బిగ్ అప్డేట్‌ను వెల్లడించాడు.
‘VT-15’ టైటిల్ గ్లింప్స్ జనవరి 19న రిలీజ్ కానున్నట్లు తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్‌ను షేర్ చేశాడు. ఆ పోస్టర్‌లో వరుణ్ తేజ్ లుక్ పూర్తిగా గుర్తుపట్టలేనంతగా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. చేతిలో ఓ సీసా పట్టుకుని కనిపిస్తున్న ఆయనకు గుబురుగా ఉన్న జుట్టు, భిన్నమైన గెటప్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. ఆ సీసాపై ‘S’ అనే అక్షరం, దానిపై ఉన్న భయంకరమైన బొమ్మ, అలాగే ‘కోకా’ అనే పదం సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి ‘VT-15’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి.
Read More..
కొడుకుతో మెగా కపుల్.. ఆకట్టుకుంటున్న క్యూట్ ఫొటోస్






