- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డే 1 వందకోట్లు వసూలు చేసిన 9 ఇండియన్ సినిమాలు.. అందులో ఐదు ఆ హీరోవే!
ఒకప్పుడు సినిమా ఎన్ని రోజులు ఆడింది అనేదాన్ని బట్టి హిట్, ఫ్లాప్ అనేది చెప్పేవాళ్లు. దానిని బట్టే రికార్డులు కూడా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు సినిమా విడుదలవ్వకముందే రికార్డులు మొదలవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు సినిమా ఎన్ని రోజులు ఆడింది అనేదాన్ని బట్టి హిట్, ఫ్లాప్ అనేది చెప్పేవాళ్లు. దానిని బట్టే రికార్డులు కూడా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు సినిమా విడుదలవ్వకముందే రికార్డులు మొదలవుతున్నాయి. సినిమాకు సంబంధించిన పతి అంశం కూడా ఓ రికార్డే. సినిమా విడుదలకు ముందు ట్రైలర్‌కు వచ్చిన వ్యూవ్స్, వచ్చిన లైక్స్ కూడా రికార్డులే. అంతే కాకుండా డే 1 సినిమా ఎన్నికోట్లు వసూలు చేసింది అనేదానే ప్రస్తుతం చాలా ఆసక్తి నెలకొంది. సినిమా మొదటి రోజు వసూళ్లను కచ్చితంగా చూస్తున్నారు. దీంతో మొదటి రోజు వంద కోట్లు సాధించిన సినిమాలు కూడా రికార్డు క్రియేట్ చేసినట్టే.
అలా ఇండియాలో తొలిరోజే వంద కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమాలు ఏవో చూద్దాం.. మొట్టమొదటగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 సినిమా వందకోట్ల గ్రాస్ వసూలు చేసింది. 2017లో వచ్చిన ఈ చిత్రం ఇండియన్ చిత్రాలలో రికార్డు క్రియేట్ చేసింది. ఆ తరవాత ప్రభాస్ హీరోగా నటించిన సాహో 2019లో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రం కూడా వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తరవాత వరుసగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2, ఆదిపురుష్, సలార్, కల్కి, దేవర, పుష్ప2 సినిమాలు తొలిరోజే వంద కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. ఈ సినిమాలలో పుష్ప 2 ఏకంగా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు ఇందులో కేజీఎఫ్ మినహా మిగితా సినిమాలు అన్నీ టాలీవుడ్ చిత్రాలే కాగా ప్రభాస్ నటించినవే ఐదు సినిమాలు కావడం విశేషం. ఇక తెలుగు సినిమాల హవా ఇలానే కొనసాగితే త్వరలో మరిన్ని టాలీవుడ్ చిత్రాలు సైతం ఈ లిస్టులో చేరతాయి.
Read more : టేబుల్ పై పడుకొని ఆ పని చేస్తున్న యంగ్ బ్యూటీ.. లైఫ్ చాలా చిన్నదంటూ పోస్ట్






