ఓటర్లకు షాక్ ఇచ్చిన ఈసీ.. వారిపై కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం

by  |
Chief Electoral Officer Shashank Goel
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన హుజురాబాద్ ఉప ఎన్నిక నోటుకు ఓటు వ్యవహారంపై ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ స్పందించారు. ఈ సందర్భంగా శనివారం జరగనున్న పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అయితే, తమకు డబ్బులు పంచలేదని నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగా వచ్చి ఆందోళన చేపట్టిన ఓటర్లపై క్రిమినల్ కేసులు పెడతామని ప్రకటించారు. ఓటర్లకు డబ్బులు పంచినా, ఓటర్లు డబ్బులు తీసుకున్నా నేరమే అన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను పరిశీలించి డబ్బు అడిగిన వారిని గుర్తించి కేసులు పెడతామని శశాంక్ పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఫీల్డ్ లెవల్‌లో దర్యాప్తు చేస్తున్నారని, ఒకవేళ డబ్బులు అడిగినట్లు తెలిస్తే వారిపై కేసులు నమోదు చేస్తారని తెలిపారు.

Next Story

Most Viewed