ఆ వీడియో బయటకి వస్తే బాగుండు.. చంద్రబాబును డిఫెన్స్‌లో పడేసిన రోజా

188
MLA Roja

దిశ, ఏపీ బ్యూరో: హుద్ హుద్ బాధితుల్ని ఇప్పటికీ ఆదుకోని చంద్రబాబు రాయలసీమ బాధితుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. గాల్లో వచ్చిన వాడు గాల్లోనే పోతాడు అంటూ చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లి సోనియా, చిదంబరం కాళ్ళ మీద పడింది చంద్రబాబే అన్నారు. భారీ వర్షాలు మానవ తప్పిదం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితం అని  రోజా కొట్టిపారేశారు. అంతేకాకుండా గోదావరి పుష్కరాల సందర్భంగా షూటింగ్ పిచ్చితో 29 మంది చనిపోయేలా చేసింది చంద్రబాబు అని పేర్కొన్నారు.

మానవ తప్పిదం అంటే అది అని అన్నారు. ఆ ఘటనలో వాస్తవాలు బయటకు రాకుండా సీసీటీవీ ఫుటేజ్‌ని డిలీట్ చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించిన రోజా ఆ ఫుటేజ్ బయటకు వచ్చి ఉంటే చంద్రబాబు చిప్పకూడు తినేవాడని దుయ్యబట్టారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం, లోకేష్ ఎమ్మెల్యే కావడం జరగని పని అని ఆమె అన్నారు.

నందమూరి ఫ్యామిలీపై కొడాలి నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. చంద్రబాబు రియాక్షన్..?

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..