నందమూరి ఫ్యామిలీపై కొడాలి నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. చంద్రబాబు రియాక్షన్..?

424

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. గురువారం మంత్రి కోడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. అతని భార్యను అతనే అల్లరి చేసుకుంటూ నన్ను క్షమాపణ చెప్పమనడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన భార్య పేరు తీస్తే.. ఎన్టీఆర్ కుటుంబం మద్దతిస్తుందని చంద్రబాబు కుట్ర పన్నాడంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.

నందమూరి ఫ్యామిలీ అంటే సీఎం జగన్‌కు కూడా గౌవరమేనని తెలిపారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు ఎన్టీఆర్ ఫ్యామిలీ చంద్రబాబుని నమ్మిందని విమర్శించారు. ఈ సందర్భంగానే నారా భువనేశ్వరి గురించి.. అసెంబ్లీలోగానీ.. బయటగానీ.. ఆమె పేరు తీయలేదని నాని స్పష్టం చేశారు. నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అమాయకులంటూ కామెంట్స్ చేయటం విశేషం. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయడమేంటని నాని ప్రశ్నించారు.

Read More: కొడాలి నానికి జూ.ఎన్టీఆర్ అంటే భయం..

చైతుతో విడాకులు.. సామ్ అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఎందుకొచ్చినట్లు?

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..