- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హమాలీ అడ్డా వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి
పాల్వంచ పట్టణంలోని హమాలీ అడ్డ వద్ద స్పైసీ హోటల్ ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.

దిశ, పాల్వంచ టౌన్ : పాల్వంచ పట్టణంలోని హమాలీ అడ్డ వద్ద స్పైసీ హోటల్ ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. రోడ్డు పక్కన ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు 55 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. స్థానిక ట్రాలీ అడ్డ డ్రైవర్లు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 9 నుంచి 10 గంటల సమయంలో సదరు వ్యక్తి అక్కడే రోడ్డు పక్కన కూర్చొని ఉన్నాడని, అనంతరం కొంతసేపటి తర్వాత స్పందించకపోవడంతో పరిశీలించగా మృతి చెంది ఉన్నట్లు తెలిసిందని తెలిపారు. మృతుడు నీలిరంగు చొక్కా, కాఫీ రంగు ప్యాంటు, బెల్ట్ ధరించి ఉండగా, అతని పక్కనే ఒక టవల్ కూడా ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, అతని గుర్తింపునకు సంబంధించి చర్యలు కొనసాగుతున్నాయని సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. మృతుడి పూర్తి వివరాలు, మరణానికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.






