- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీబీఎస్ఈ కెమిస్ట్రీ మార్కుల వివాదం: కరెక్షన్‌లో ఆలస్యం, విద్యార్థుల ఆందోళన
సీబీఎస్ఈ క్లాస్ 12 కెమిస్ట్రీ మార్కుల మూల్యాంకనంలో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: సీబీఎస్ఈ (CBSE) క్లాస్ 12 బోర్డు పరీక్షల మార్కులకు సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద వివాదం చెలరేగుతోంది. ముఖ్యంగా కెమిస్ట్రీ (Chemistry) పేపర్ మూల్యాంకనంలో (Evaluation) జరిగిన అవకతవకలపై విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు అడ్మినిస్ట్రేటివ్, డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలలో లోపాల కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతూ.. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
కెమిస్ట్రీలోనే అత్యధిక లోపాలు..
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విద్యార్థులు చేసిన ఫిర్యాదులపై ఓసింట్ (OSINT) జరిపిన విశ్లేషణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. మొత్తం ఫిర్యాదులలో 65 శాతానికి పైగా కెమిస్ట్రీ సబ్జెక్టుకు సంబంధించినవే ఉన్నాయి. బాగా చదివే విద్యార్థులకు సైతం అత్యల్ప మార్కులు వచ్చాయి. దీంతో జేఈఈ మెయిన్స్ (JEE Main)లో 95 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు, కెమిస్ట్రీలో తక్కువ మార్కులు రావడం వల్ల ఐఐటీ, ఎన్‌ఐటీ ప్రవేశాలకు అవసరమైన 75 శాతం మార్కుల అర్హతను కోల్పోతానేమోనని ఆందోళన చెందుతున్నాడు. 70 మార్కులకు 67 వస్తాయని ఆశించిన కొందరు విద్యార్థులకు ఘోరంగా 4 మార్కులు మాత్రమే ఇచ్చారు.
ఒక పేపర్ అడిగితే.. మరో పేపర్ పంపడం..
ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM), ఆన్‌మార్క్ (OnMark) డిజిటల్ వ్యవస్థలలో సాంకేతిక లోపాలే దీనికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులకు పంపిన స్కాన్ చేసిన ఆన్సర్ షీట్లు స్పష్టంగా లేకపోవడం (Blurred), కొన్ని పేజీలు పూర్తిగా కనిపించకపోవడం, కరెక్ట్‌గా రాసిన సమాధానాలకు సున్నా మార్కులు వేయడం, అసలు దిద్దకుండా వదిలేయడం వంటివి జరిగాయి. విద్యార్థుల ప్రధాన ఫిర్యాదులలో రీ-ఎవల్యూషన్ పోర్టల్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, విపరీతమైన ఆలస్యం గురించే ఉన్నాయి. మరికొందరైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్ల కాపీల కోసం దరఖాస్తు చేసుకుంటే బోర్డు సిబ్బంది వారికి ఇంగ్లీష్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆన్సర్ షీట్లను పంపడం గమనార్హం.






