ఫ్లాష్.. ఫ్లాష్.. లాక్‌డౌన్‌పై కేంద్రం కీలక ప్రకటన

409

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌పై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించడంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. కరోనా కట్టడికి రాష్ట్రాలే చర్యలు తీసుకోవాలని స్ఫష్టం చేసింది. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ ఎందుకు విధించడం లేదని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు.. పై విధంగా కేంద్రం సమాధానమిచ్చింది. కేంద్ర ప్రకటనతో ఇక నేషనల్ లాక్‌డౌన్ ఉండదని క్లియర్‌గా అర్థమవుతుంది. రాష్ట్రాలకే లాక్‌డౌన్ విధించుకునే అవకాశాన్ని కేంద్రం ఇచ్చింది.

అటు లాక్‌డౌన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు) కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాను అడ్డుకోవాలంటే లాక్‌డౌన్ ఒక్కటే చివరి అస్త్రం అని, లాక్‌డౌన్‌ విధింపునకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని సూచనలు చేసింది. ఇప్పటికే మహమ్మారి బారినపడిన రోగులకు ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో లాక్‌డౌన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ నిర్ణయాలను రాష్ట్రాలే తీసుకోవాలని కేంద్రం ప్రకటన చేయడం గమనార్హం.

మీడియాను నియంత్రించలేం : సుప్రీంకోర్టు

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..