- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోరు.. భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు
భారతీయ స్టాక్ మార్కెట్ల జోరు మళ్లీ మొదలైంది. ఉదయం ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్ 1039 పాయింట్లు, నిఫ్టీ 330 పాయింట్లు లాభపడ్డాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: వరుస నష్టాలతో కుదేలైన భారతీయ స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు సరికొత్త ఉత్సాహంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.30కి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ 1039 పాయింట్లు లాభపడి 73,736 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ (NIFTY) కూడా అదే బాటలో పయనిస్తోంది. 330 పాయింట్లు లాభపడి 22,843 పాయింట్లు వద్ద ట్రేడ్ అవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిస్థితులు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (FII) కొనుగోళ్లు మార్కెట్లకు బలాన్ని ఇచ్చాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ రంగాలు మార్కెట్ పెరుగుదలలో కీ రోల్ పోషిస్తున్నాయి.
Stock Market: స్టాక్ మార్కెట్ల రికవరీ
Next Story






