Stock Market: స్టాక్ మార్కెట్ల రికవరీ

by S Gopi |   (  Updated:2026-03-24 12:27:46  IST  )

హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్‌కు గడువును పొడిగించినట్లు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో ఓ దశలో సెన్సెక్స్ 1,700 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 23 వేల పైకి చేరాయి.

Stock Market: స్టాక్ మార్కెట్ల రికవరీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతకుముందు సెషన్‌లో చూసిన పతనం తర్వాత ఇరాన్ఐ అమెరికా దాడులకు 5 రోజుల బ్రేక్ ఇవ్వడం, ఆ వెంటనే చమురు ధరలు దిగిరావడం వంటి పరిణామాల తర్వాత మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు రికవరీ సాధించాయి. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్‌కు గడువును పొడిగించినట్లు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో ఓ దశలో సెన్సెక్స్ 1,700 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 23 వేల పైకి చేరాయి. ఆ తర్వాత స్థిరపడినప్పటికీ అధిక లాభాలను నమోదు చేశాయి. ఈ క్రమంలోనే మదుపర్ల సంపద రూ. 8 లక్షల కోట్లు పుంజుకుంది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 423 లక్షల కోట్లకు చేరింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1372.06 పాయింట్లు ఎగసి 74,068 వద్దకు, నిఫ్టీ 399.75 పాయింట్లు పుంజుకుని 22,912 వద్ద ముగిశాయి. అయితే, హార్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న పరిణామాలపై మరింత స్పష్టత కోసం ఇన్వెస్టర్లు చూస్తున్నారు. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ 101.9 డాలర్లకు చేరిందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.

Stock Market: స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోరు.. భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు

Next Story