- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SIP: రిస్క్ లేకుండా గ్యారెంటీ రాబడి పొందే మార్గం..రూ.5000తో రూ.1 కోటి మీ సొంతం
SIP: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలేని వారు సిప్ వైపు చూస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: SIP: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలేని వారు సిప్ వైపు చూస్తున్నారు. దీనికి కారణం ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ రాబడి పొందడం. సిప్ అనేది మార్కెట్ లింక్డ్ స్కీమ్. దీనితో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడతాయి. మార్కెట్ తో అనుసంధానించబడినప్పటికీ , రిస్క్ తక్కువగా పరిగణిస్తుంది. అంతేకాదు షేర్లలో నేరుగా ఇన్వెస్ట్ చేయడం కంటే రాబడి మెరుగ్గా ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో సగటున 12శాతం రాబడిని ఇస్తుంది. ఇతర ప్లాన్స్ లో ఇది అందుబాటులో లేదు. సిప్ ప్రారంభించడానికి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సిన పనిలేదు. కేవలం రూ. 500నుంచి ప్రారంభించవచ్చు. పెట్టుబడి ఎంత ఎక్కువ అయితే రిటర్న్స్ కూడా అంత ఎక్కువగా ఉంటాయి.
సిప్ లో పెట్టుబడి పెట్టేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదట మీరు ప్రతి నెలా కొంత డబ్బు చెల్లించడం ద్వారా సులభంగా సిప్ ను అమలు చేసుకోవచ్చు. మరొక మార్గం దానిని ఎప్పటికప్పుడు టాప్ అప్ చేయడం. ఇది సిప్ లాభదాయకతను పెంచుతుంది. సిబ్ ను టాప్ అప్ చేయడం ద్వారా మీరు త్వరలో లక్షాధికారిగా మారుతారు. ఎలాగో తెలుసుకుందాం.
రూ. 5వేల సిప్ లెక్కింపును ఉదాహరణగా తీసుకుంటే మీరు 5వేల సిప్ ను రెగ్యులర్ గా ప్రారంభించి 21ఏళ్లే కొనసాగించండి. 21ఏళ్లలో మీరు మొత్తం 12,60,000ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు 12శాతం రాబడి ఆధారంగా లెక్కిస్తే మీకు రూ. 39, 55,034 వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా మీరు 20ఏళ్లలో మొత్తం రూ. 52, 15,034 వరకు పొందుతారు. మీరు 5వేల సిప్ ప్రారంభించి ప్రతి ఏడాది 10శాతం వడ్డీకి దాన్ని టాప్ అప్ చేస్తే మీరు 21ఏళ్లలో రూ. 1కోటి నిధిని సులభంగా సేకరించవచ్చు. టాప్ అప్ సిప్ అనేది మీ సాధారణ సిప్ కు కొంత మొత్తాన్ని జోడించగల సౌకర్యం ఉంటుంది.
మీరు నెలకు 5వేల సిప్ ను ప్రారంభిస్తే..ఆపై ఒక ఏడాది తర్వాత దానిని 5వేలలో 10శాతం పెంచాలి. అంటే 500. ఇప్పుడు మీ సిప్ 5,500 అవుతుంది. వచ్చే ఏడాది మీరు 5,500తో 10శాతం అంటే 550 పెంచాలి. ఈ సందర్భంలో మీ సిప్ రూ. 6,050 అవుతుంది. మీరు ప్రతి ఏడాది ప్రస్తుత సిప్ మొత్తం 10 శాతం యాడ్ చేయాలి.
రూ. 5000 నుండి సిప్ ప్రారంభించి ఏటా 10శాతం టాప్-అప్ చెల్లిస్తే, 21ఏళ్లలో మొత్తం రూ. 38,40,150 ఇన్వెస్ట్ చేస్తారు. కానీ 12 శాతం రాబడి అనుకుంటే దీనిపై వడ్డీ రూ. 70,22,858 అవుతుంది. మీకు 21ఏళ్లలో రూ. 1,08,63,008 ఉంటుంది. అంటే మీరు ఏడాదికి 10 శాతం చొప్పున రీఛార్జ్ చేయడం ద్వారా రూ. 5వేలు సాధారణ సిప్ తో సంపాదించాలంటే అనుకన్న దానికంటే రెట్టింపు సంపాదించవచ్చు.
Read More..
Post Office Scheme: ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ.9,250.. ఈ స్కీమ్ వడ్డీ రేట్లు, ప్రయోజనాలు ఇవే!
5ఏళ్ల మీ కూతురి కోసం ఇలా పెట్టుబడి పెట్టండి.. ఆమె భవిష్యత్‌క ఢోకా ఉండదు!






