- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Post Office Scheme: ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ.9,250.. ఈ స్కీమ్ వడ్డీ రేట్లు, ప్రయోజనాలు ఇవే!
Post Office Scheme: చిన్నమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి పోస్టాఫీస్ స్కీమ్ బెస్ట్ అని చెప్పవచ్చు.

దిశ, వెబ్ డెస్క్: Post Office Scheme: చిన్నమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి పోస్టాఫీస్ స్కీమ్ బెస్ట్ అని చెప్పవచ్చు. 2025లో నెలలవారీ ఇన్ కమ్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ మంచి రిటర్న్స్ అందిస్తుంది. చాలా తక్కువ రిస్క్ ఉంటుంది. రిటైర్ మెంట్ తర్వాత రిస్కు లేకుండా ప్రతినెలా కొంత ఆదాయం చేతికి అందాలని కోరుకునేవారికి ఇది బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ పథకం ఎలా ఉంటుంది. వడ్డీరేట్లు, ప్రయోజనాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
పోస్టాఫీస్ మంత్లీ స్కీమ్ అనేది భారత ప్రభుత్వం తీసుకువచ్చిన సేవింగ్స్ స్కీమ్ ఇది. ఇది స్టాక్ మార్కెట్ తో సంబంధం లేకుండా 5ఏళ్లపాటు ఫిక్స్డ్ మంత్లీ ఇన్ కమ్ అందిస్తుంది. మీరు గ్యారెంటీ రిటర్న్స్ కోసం చూస్తున్నట్లయితే పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ చక్కగా సరిపోతుంది. స్కీమ్ వడ్డీ రేటు 5ఏళ్ల పీరియడ్ లో ఉంటుంది. ఇందులో కేవలం వెయ్యితో ఇన్వెస్ట్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ లో గరిష్టంగా రూ. 15లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. లేదా మీరు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ ఏడాదికి 7.7శాతం వడ్డీని అందిస్తుంది. మీరు నెలలవారీ ఆదాయం ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్ పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ప్రస్తుత వడ్డీ రేటుతో మీరు రూ. 1,50, 000ఇన్వెస్ట్ చేస్తే మీకు నెలకు రూ. 962.50 అందుతుంది. అలానే రూ. 3,00, 000 అయితే రూ. 1,925, రూ. 4,500, 000 అయితే రూ. 2,887.50చేతికి అందుతుంది. ఏకంగా రూ. 6,00,000 పెట్టుబడిపెట్టిన వారికి రూ. 3,850 అదే రూ. 7,50,000 చేసిన వారికి రూ. 4,812.50 రిటర్న్స్ లభిస్తాయి. రూ. 9,00,000 మొత్తం చేస్తే రూ. 5,775, రూ. 15, 00, 000 పెట్టుబడికి రూ. 9,625 లభిస్తుంది. డబ్బు ప్రతినెలా మీ లింక్డ్ సేవింగ్స్ అకౌంట్లో డైరెక్టుగా క్రెడిట్ అవుతుంది.
నెలకు రూ. 9,250 సంపాదించడానికి, జాయింట్ అకౌంట్లో రూ. 15,00,000 పెట్టుబడి పెట్టండి. జాయింట్ అకౌంట్ అయితే గరిష్ట పరిమితి 7.7శాతం వడ్డీతో ఏడాదికి రూ. 1,15,500 లేదా నెలకు రూ. 9,625 ఇస్తుంది. ముగ్గురు వరకు జాయింట్ అకౌంట్ షేర్ చేసుకోవచ్చు. మీరు ఈ రిటర్న్స్ రోజువారీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు లేదంటే వేరేచోట సేవ్ చేసుకోవచ్చు. భారత్ లో నివసించే వ్యక్తులు మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. 10ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి పిల్లలు వారి సొంతంగా అకౌంట్ మేనేజ్ చేసుకోవచ్చు. ప్రవాస భారతీయులకు అర్హత లేదు. అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్టు సైజు ఫొటోలు, యుటిలిటీ బిల్లు లేదా పాస్ పోర్టు వంటివి అవసరం ఉంటాయి. పోస్టాఫీస్ అప్లికేషన్ ఫారమ్ కూడా నింపాలి.
అకౌంట్ తీసుకోవడం చాలా ఈజీ. సమీపంలోని పోస్టాఫీస్ కు వెళ్లి mis ఫారమ్ తీసుకుని నింపండి. అవసరమైన పత్రాలు అందజేసి నగదు లేదా చెక్కుతూ చెల్లించండి. మీకు పాస్ బుక్, అకౌంట్ వివరాలు అందిస్తారు. మీ నెలలవారీ ఆదాయాన్ని సులభంగా పొందేందుకు దీన్ని సేవింగ్స్ అకౌంట్ కు లింక్ చేసుకోండి. మెచ్యూరిటీకి ముందే డబ్బు అవసరం అయినట్లయితే ఏడాది ముందే విత్ డ్రా చేసుకోలేరు. 1 నుంచి మూడేళ్ల మధ్య ఇన్వెస్ట్ మెంట్ లో 2శాతం పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. 3 నుంచి 5ఏళ్ల మధ్య 1శాతం కోల్పోతారు. 5ఏళ్ల తర్వాత ఎలాంటి జరిమానా లేకుండా తీసుకోవచ్చు.
Read More..
SIP: రిస్క్ లేకుండా గ్యారెంటీ రాబడి పొందే మార్గం..రూ.5000తో రూ.1 కోటి మీ సొంతం






