రిలయన్స్ జియో ఫ్రీడమ్ ఆఫర్!

by Disha Web Desk 7 |
రిలయన్స్ జియో ఫ్రీడమ్ ఆఫర్!
X

న్యూఢిల్లీ: మెరుగైన ఇంటర్నెట్, ఓటీటీ కంటెంట్ ఇష్టపడే వినియోగదారుల కోసం దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫ్రీడమ్ ఆఫర్ పేరుతో జియో రూ. 2,999 దీర్ఘకాలిక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఆన్‌లైన స్ట్రీమింగ్, సినిమా, అధిక ఇంటర్నెట్ వాడే వారికోసం ఈ ప్రత్యేక ఆఫర్ ప్యాక్‌ను తెచ్చినట్టు కంపెనీలు తెలిపింది. ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్ ద్వారా రూ. 2,999తో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు రోజుకు 200 ఎస్ఎంఎస్‌లతో పాటు అపరిమిత కాలింగ్, 365 రోజుల పాటు రోజుకు 2.5జీబీ ఇంటర్నెట్‌ను పొందవచ్చు.

అదనంగా 75జీబీ డేటా కూడా లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా ఈ ప్లాన్ తీసుకున్న వారికి రూ. 3,000 విలువైన ప్రయోజనాలు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. అందులో భాగంగా ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్, ఇక్సిగోలపై రూ. 750 తగ్గింపు, అజియో షాపింగ్‌పై రూ. 750, నెట్‌మెడ్స్‌పై రూ. 750 తగ్గింపు ఆఫర్‌ను అందిస్తున్నట్టు వివరించింది. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64కేబీపీఎస్‌కి తగ్గుతుంది. జియో దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెచ్చిన ఈ ఆఫర్ ప్లాన్ ద్వారా సబ్‌స్క్రైబర్లు రూ. 3 వేల విలువైన ఇతర ప్రయోజనాలను పొందుతారని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

'సెక్సీ బాంబ్'.. మరింత మత్తుగా బ్యాక్ అందాలు ప్రదర్శించిన ఈషా


Next Story

Most Viewed