India: 'టారిఫ్‌ల కంటే కాలుష్యమే భారత్‌కు అతిపెద్ద ముప్పు': గీతా గోపినాథ్

by S Gopi |   (  Updated:2026-01-22 12:48:56  IST  )

కాలుష్యం నిశ్శబ్దంగా భారత దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి అత్యంత తీవ్రమైన ప్రమాదాలలో ఒకటిగా మారుతోందన్నారు.

India: టారిఫ్‌ల కంటే కాలుష్యమే భారత్‌కు అతిపెద్ద ముప్పు: గీతా గోపినాథ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థకు వాణిజ్య సుంకాల కంటే కాలుష్యమే అతిపెద్ద ప్రమాదకారిగా ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) మాజీ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ హెచ్చరించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్) కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. కాలుష్యం నిశ్శబ్దంగా భారత దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి అత్యంత తీవ్రమైన ప్రమాదాలలో ఒకటిగా మారుతోందన్నారు. దేశంలో కాలుష్యం క్లిష్టమైన సవాలు, భారత ఆర్థికవ్యవస్థపై దాని ప్రభావం ఇప్పటివరకు విధించిన సుంకాల ప్రభావం కంటే చాలా ఎక్కువగా ఉండనుంది. కాలుష్యం చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇది కార్మికుల ఉత్పాదకతను తగ్గిస్తుంది, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను పెంచుతుంది. మొత్తంగా ఆర్థిక కార్యకలాపాలను నెమ్మదినడం ద్వారా వృద్ధిపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వివరించారు. సాధారణంగా టారిఫ్ ప్రజా, రాజకీయ అంశాల్లో కీలకం అయినప్పటికీ, పర్యావరణ నష్టం శాశ్వత, విస్తృత ఆర్థిక ప్రభావం చూపుతుందనే విషయాన్ని గుర్తించాలని, కాబట్టి కాలుష్యంపై ఎక్కువ శ్రద్ధ అవసరమని ఆమె తెలిపారు. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై, మౌలిక సదుపాయాలను నిర్మించడంలో పురోగతి సాధిస్తున్నప్పటికీ, కాలుష్యం తీవ్రమైన ఆందోళనగా ఉంది, ముఖ్యంగా పెద్ద నగరాల్లో దీని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Read More... భారత్‌తో త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందం.. దావోస్ వేదికగా ట్రంప్ కీలక ప్రకటన

టారిఫ్‌లు రద్దు చేసిన ట్రంప్

Next Story