- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టారిఫ్‌లు రద్దు చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల విషయంలో మరోసారి వెనక్కి తగ్గారు.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల విషయంలో మరోసారి వెనక్కి తగ్గారు. యూరోపియన్ యూనియన్ (EU) దేశాలపై విధించాలనుకున్న టారిఫ్‌లపై యూటర్న్ తీసుకున్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా కొనుగోలు చేయడంలో అడ్డంకులు సృష్టిస్తున్నాయనే కారణంతో డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్, ఫిన్‌లాండ్ సహా 8 యూరోపియన్ దేశాలపై 10 శాతం టారిఫ్‌లు విధిస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తెచ్చి, జూన్ 1 నుంచి 25 శాతానికి పెంచాలన్నది అమెరికా ప్లాన్. అయితే ఈ ప్రకటనపై EU దేశాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు అమెరికా–EU వాణిజ్య ఒప్పంద ప్రక్రియను నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో చర్చల తర్వాత గ్రీన్‌ల్యాండ్, ఆర్క్‌టిక్ ప్రాంతంపై ఒక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం కుదిరిందని ట్రంప్ తెలిపారు.
దీంతో తన ట్రూత్ సోషల్ వేదికగా ఈ టారిఫ్‌లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రీన్‌లాండ్ పై చర్చల కొనసాగుతాయని కూడా పేర్కొన్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం EU దేశాలకు తాత్కాలిక ఊరట కలిగించినప్పటికీ, అమెరికా వాణిజ్య ఒత్తిడి విధానాలపై విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అమెరికా–EU సంబంధాలు కొంత సద్దుమణిగినా, భవిష్యత్ చర్చలు ఎలా సాగుతాయన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Read More..






