- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"ఆ ఐస్ ముక్క మాకు కావాలి" : నాటో దేశాలకు ట్రంప్ హుకుం
దావోస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్ : దావోస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు. గ్రీన్‌లాండ్ ను ఉద్దేశిస్తూ తమకు ఆ చిన్న ఐస్ ముక్క కావాలని, ఇందుకు నో అనేవారిని అస్సలు మర్చిపోమని హెచ్చరించారు. గతంలో చాలా యూరప్ దేశాలు ఇతర భూభాగాలను స్వాధీనం చేసుకున్నాయని, అందులో తప్పు ఏమీలేదన్నారు. అయితే నిజానికి గ్రీన్‌లాండ్ అమెరికాదేనని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత డెన్మార్క్‌కు ఇచ్చామని తెలిపారు. అమెరికా, రష్యా, చైనాల మధ్య గ్రీన్‌లాండ్ చాలా కీలకమైన ప్రదేశమని, ప్రస్తుతం అమెరికా జాతీయ భద్రత కోసం ఆ చిన్న ఐస్ ముక్క తమకు అవసరం అన్నారు.
వాళ్లు ఇస్తే సంతోషిస్తామని, ఇవ్వకపోతే గుర్తు పెట్టుకుంటామని పరోక్షంగా వార్నింగ్ ఇస్తూనే.. ఏ పరిస్థితిలోనూ గ్రీన్‌లాండ్ ను బలవంతంగా తీసుకోమని, చర్చల ద్వారానే నిర్ణయం తీసుకుంటామని దావోస్ వేదికగా ట్రంప్ పేర్కొన్నారు.






