పూర్తి భారతీయ కంపెనీగా మారిన PhonePe

by Disha Web Desk 17 |
పూర్తి భారతీయ కంపెనీగా మారిన PhonePe
X

న్యూఢిల్లీ: వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ తన ఆధ్వర్యంలోని ఫోన్‌పే యాజమాన్య విభజనను పూర్తి చేసింది. దీంతో రెండు కంపెనీలు కూడా విడివిడిగా తమ కార్యకలాపాలను కొనసాగించనున్నాయి. 2016లో ఫోన్‌పే గ్రూప్‌ను ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ విభజన ద్వారా ఫోన్‌పే పూర్తిగా భారత్‌కు చెందిన కంపెనీగా మారనుంది. ఇంతకు ముందు దీని ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉండేది.

ప్రస్తుతం ఫోన్‌పే భారత్‌లో 400 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. టైర్ 2, 3, 4 నగరాలలో విస్తరిస్తు 35 మిలియన్లకు పైగా ఆఫ్‌లైన్ వ్యాపారులను విజయవంతంగా డిజిటలైజ్ చేసింది. ఫోన్‌పే వ్యాపార విస్తరణలో నిధుల సమీకరణ కోసం దాని మాతృసంస్థ వాల్‌మార్ట్‌తో చర్చలు జరుపుతుంది. 700 మిలియన్ నుంచి 1 బిలియన్ డాలర్లకు పైగా సమీకరించాలని చూస్తోంది. ఇది పూర్తయితే గనుక ఫోన్‌పే విలువ రెండింతలు పెరగనుంది.


Next Story

Most Viewed