భారత్‌పై యూఎస్ సుంకాల తగ్గింపు.. భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-03 05:54:44  IST  )

భారత ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

భారత్‌పై యూఎస్ సుంకాల తగ్గింపు.. భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై విధిస్తున్న సుంకాలను (Tariffs) భారీగా తగ్గిస్తూ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో జరిపిన చర్చల అనంతరం, భారత్‌ను తన గొప్ప స్నేహితుడు‌గా అభివర్ణిస్తూ ట్రంప్ ఈ డీల్‌ను ఖరారు చేశారు. ఈ పరిణామంతో ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా రాకెట్‌లా దూసుకుపోయాయి. ట్రంప్ ప్రకటనతో ఇన్వెస్టర్లలో నూతనోత్సాహం నెలకొంది. దీంతో సెన్సెక్స్ ఏకంగా 2,500 పాయింట్లకు పైగా లాభపడి రికార్డు సృష్టించింది. మరోవైపు నిఫ్టీ (Nifty) దాదాపు 760 పాయింట్లకు పైగా ఎగబాకింది. అదేవిధంగా అమెరికాకు ఎగుమతులు చేసే IT సర్వీసెస్, ఫార్మా, టెక్స్‌టైల్స్, జెమ్స్, జ్యువెలరీ ఆటోమొబైల్ రంగాల షేర్లు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ముఖ్యంగా ఎగుమతిదారుల మధ్య పోటీ పెరగడం వల్ల కార్పొరేట్ ఆదాయాలు వృద్ధి చెందుతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

కాగా, గతంలో భారత్‌పై 25 శాతంగా సుంకాన్ని (Reciprocal Tariff) 18 శాతానికి తగ్గిస్తున్నట్లుగా అమెరికా ప్రకటించింది. అదేవిధంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా గతంలో విధించిన అదనపు 25 శాతం శిక్షాత్మక సుంకాన్ని అమెరికా పూర్తిగా తొలగించింది. దీంతో ఎఫెక్టివ్ టారిఫ్ 50 శాతం నుంచి 18 శాతానికి పడిపోయింది. భారత్ ఇకపై రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసి, అమెరికా, వెనిజులా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడానికి అంగీకరించింది. అదేవిధంగా అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలను కూడా భవిష్యత్తులో జీరోకు తగ్గించేలా రెండు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి.

దేశీయ కరెన్సీ సరికొత్త జోరు.. భారీగా పెరిగిన రూపాయి విలువ

Next Story