Economy: భారత వృద్ధిలో కోత విధించిన మూడీస్

by S Gopi |   (  Updated:2026-04-05 16:54:59  IST  )

దిగుమతి చేసుకునే ఎరువులపై ఆధారపడటం వల్ల ఆహార ద్రవ్యోల్బణం కూడా ప్రభావితం అవుతుందని మూడీస్ తెలిపింది.

Economy: భారత వృద్ధిలో కోత విధించిన మూడీస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల భారత వృద్ధి ప్రభావితం అవుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ రేటింగ్స్ తెలిపింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం పెరిగే రిస్క్ ఉందని, దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ ఆర్థిక వృద్ధి అంచనాలను 6 శాతానికి తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఇదివరకు మూడీస్ భారత వృద్ధి రేటును 6.8 శాతంగా అంచనా కట్టింది. ముఖ్యంగా ఎల్‌పీజీ సరఫరాలో ఏర్పడే దీర్ఘకాలిక అంతరాయం, సమీప భవిష్యత్తులో గృహ అవసరాలకు ఏర్పడే కొరత, అధిక ఇంధన, రవాణా ఖర్చులకు దారితీస్తాయని, అలాగే దిగుమతి చేసుకునే ఎరువులపై ఆధారపడటం వల్ల ఆహార ద్రవ్యోల్బణం కూడా ప్రభావితం అవుతుందని మూడీస్ తెలిపింది. అయితే, ప్రస్తుతానికి భారత్‌లో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నప్పటికీ, భౌగోళిక రాజకీయ పరిణామాల వల్ల పెరగవచ్చని అభిప్రాయపడింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, 2026-27లో 4.8 శాతానికి చేరుకోవచ్చని వెల్లడించింది.

Read more.. త్వరలో వోచర్ల మాదిరిగా మ్యూచువల్ ఫండ్ల గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు

Next Story