- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SEBI: త్వరలో వోచర్ల మాదిరిగా మ్యూచువల్ ఫండ్ల గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల కోసం గిఫ్ట్ కార్డులను అనుమతించాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ప్రతిపాదించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో పెట్టుబడుల ప్రక్రియను సులభతరం చేసేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక ప్రతిపాదన చేసింది. అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే చర్యల్లో భాగంగా, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల కోసం గిఫ్ట్ కార్డులను అనుమతించాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ప్రతిపాదించింది. అంటే, ప్రస్తుతం ప్రజలు షాపింగ్ వోచర్లను బహుమతిగా ఇచ్చినట్లే, త్వరలో పెట్టుబడులను కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. ముఖ్యంగా, సాంప్రదాయ పెట్టుబడులు సంక్లిష్టంగా ఉన్నాయని భావించే కొత్త ఇన్వెస్టర్లను మార్కెట్లోకి వచ్చేలా, ప్రక్రియను సులభతరం చేయడమే దీని ఉద్దేశమని సెబీ అభిప్రాయపడింది. దీనికోసం మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగపడేలా గిఫ్ట్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐస్) అంటే ప్రీపెయిడ్ కార్డులు లేదా డిజిటల్ వోచర్ల లాంటివి ప్రవేశపెట్టాలనుకుంటోంది. వీటిని బ్యాంకు ఖాతా లేదా యూపీఐ ద్వారా కొనుగోలు చేయవచ్చని సెబీ పేర్కొంది.






