తొలగింపు కాకుండా జీతాల్లో కోత నిర్ణయం తీసుకున్న ఇంటెల్!

by Disha Web Desk 7 |
తొలగింపు కాకుండా జీతాల్లో కోత నిర్ణయం తీసుకున్న ఇంటెల్!
X

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాల కారణంగా ఐటీ సంస్థలు ఉద్యోగులను ఇంటిని సాగనంపుతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటెల్ మాత్రం ఉద్యోగులను తొలగించడానికి బదులు వేతనాల్లో కోత విధించడం ద్వారా సవాళ్లను అధిగమించనున్నట్టు ప్రకటించింది. ఉద్యోగులను తీసేయడం కంటే వారి జీతాలను తగ్గించాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. దీన్ని కంపెనీ సీఈఓ, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

రానున్న రోజుల్లో ఆర్థిక మాంద్యం ఉంటుందనే అంచనాలను పరిగణలోకి తీసుకుని ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తామని, దీనివల్ల కంపెనీ భవిష్యత్తు అభివృద్ధి సహాయంగా ఉంటుందని ఇంటెల్ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో వేతనాల్లో కోత నిబంధన ప్రకారం, ఇంటెల్ సీఈఓ జీతంలో 25 శాతం, ఎగ్జిక్యూటివ్‌లకు 15 శాతం, సీనియర్ మేనేజర్లకు 10 శాతం, మధ్యస్థాయి మేనేజర్లకు 5 శాతం జీతాలను తగ్గించనున్నారు. కాగా, ఇంటెల్ సంస్థ అంతర్జాతీయంగా పర్సనల్ కంప్యూటర్లలో వాడే చిప్ మార్కెట్లో లీడర్‌గా ఉంది. కరోనా మహమ్మారి వల్ల సరఫరా సమస్యలు తలెత్తడంతో అమ్మకాలు పడిపోయాయి. ఈ క్రమంలోనే ఆర్థిక మాంద్యం ఉంటుందనే పరిస్థితుల మధ్య తొలగింపుల కంటే జీతాల తగ్గింపు ద్వారా ఉద్యోగులకు ఊరటనిచ్చింది.

ఇవి కూడా చదవండి : ప్రస్తుతం FRBM గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు ఎందుకని...?


Next Story