ప్రస్తుతం FRBM గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు ఎందుకని...?

by Dishanational1 |
ప్రస్తుతం FRBM గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు ఎందుకని...?
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఎఫ్ఆర్ బీఎమ్ (FRBM) అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో మరికొద్ది రోజులు కూడా ఎక్కువగా వినిపించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో చాలా మంది ఎఫ్ఆర్ బీఎమ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎఫ్ఆర్ బీఎమ్ గురించి తెలుసుకునేందుకు నెట్టింటా భారీగా సెర్చ్ చేస్తున్నారంటా. అయితే, ఎఫ్ఆర్ బీఎమ్ అంటే ఏమిటంటే.. Fiscal Responsibility and Budget Management act. దీనినే విత్త నిర్వాహణ చట్టం అంటారు. ఈ చట్టాన్ని పార్లమెంటు 2003లో తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్థిక వనరుల నియంత్రణను పాటించేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. లేని యేడల తర్వాత వచ్చే ప్రభుత్వాలకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంటది. దీంతో రాష్ట్రంలో లేదా కేంద్రంలో అందకారంలోకి పోతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తు జాగ్రత్త కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం కారణంగా ప్రభుత్వాలు ఇష్టానుసారంగా అప్పులు చేయకుండా ఆర్థిక నియంత్రణలో ఉండేందుకు వీలుంటది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ చట్టం గురించి చర్చిస్తున్నారు. ఎఫ్ ఆర్ బీఎమ్ చట్టం నిబంధనలను ప్రభుత్వాలు పాటిస్తున్నాయా లేదా అని చర్చిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : తొలగింపు కాకుండా జీతాల్లో కోత నిర్ణయం తీసుకున్న ఇంటెల్!

Next Story

Most Viewed