ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాహన మార్కెట్‌గా భారత్!

by Disha Web Desk |
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాహన మార్కెట్‌గా భారత్!
X

న్యూఢిల్లీ: గతేడాది వాహనాల అమ్మకాల్లో భారత్ మొదటిసారిగా జపాన్‌ను అధిగమించి మూడవ స్థానానికి ఎదిగింది. నిక్కీ ఏషియా తాజా నివేదిక ప్రకారం, 2022లో భారత్‌లో మొత్తం 42.5 లక్షల కొత్త కార్లు విక్రయించబడ్డాయి. ఇది జపాన్‌లో నమోదైన 42 లక్షల కంటే ఎక్కువ. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల ప్రకారం, 2022లో జనవరి-నవంబర్ మధ్య దేశంలో మొత్తం 41.30 లక్షల కొత్త వాహనాలు విక్రయించబడ్డాయి. దీనికి డిసెంబర్‌లో మారుతీ సుజుకి విక్రయించిన వాహనాల సంఖ్యను జోడిస్తే 42.50 లక్షలకు చేరుకుంటుంది. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న నాలుగో త్రైమాసిక వాణిజ్య వాహనాల అమ్మకాలు, టాటా మోటార్స్, ఇతర వాహన తయారీ కంపెనీల అమ్మకాలను కలిపితే ఇది మరింత పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఇక, 2021లో 2.62 కోట్ల వాహనాల అమ్మకాలో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద వాహన మార్కెట్‌గా నిలిచింది. దీని తర్వాత అమెరికా 1.54 కోట్లతో రెండవస్థానంలోనూ, జపాన్ 44.40 లక్షల యూనిట్లతో జాపన్ మూడవ స్థానంలో ఉండేది. దేశీయంగా 2018లో సుమారు 44 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే, 2019లో ఇది 40 లక్షలకు తగ్గింది. ఆ తర్వాత కరోనా వల్ల 2020లో 30 లక్షలకు పడిపోగా, 2021లో తిరిగి 40 లక్షలకు పెరిగింది.

ఇవి కూడా చదవండి : ఈ ఏడాది అమ్మకాల్లో రెండంకెల వృద్ధి ఖాయం: మెర్సిడెస్ బెంజ్!


Next Story