- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Small savings schemes: మరోసారి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథం
వడ్డీ రేట్లలో వరుసగా 8 త్రైమాసికాల నుంచి ప్రభుత్వం మార్పులు చేయట్లేదు.

దిశ, బిజినెస్ బ్యూరో: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రెపో రేటులో 125 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించినప్పటికీ, 2026, జనవరి నుంచి మార్చి మధ్య కాలానికి(ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం) ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చలేదు. బుధవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, అన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లు మునుపటి త్రైమాసికంలో ఉన్నవే కొనసాగుతాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాలను పోస్టాఫీసులు, బ్యాంకులు నిర్వహిస్తుంటాయి. వడ్డీ రేట్లలో వరుసగా 8 త్రైమాసికాల నుంచి ప్రభుత్వం మార్పులు చేయట్లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో చివరిగా వడ్డీ రేట్లను సవరించింది. సాధారణంగా ప్రతి మూడు నెలలకొకసారి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం నోటిఫై చేస్తుందనే విషయం తెలిసిందే. కానీ ఈసారి, ఆర్‌బీఐ పాలసీ రేట్లను గణనీయంగా తగ్గించినప్పటికీ, పండుగ సీజన్‌కు ముందు యథాతథ స్థితిని ఎంచుకుంది. రేట్లను స్థిరంగా ఉంచడం వినియోగదారుల సెంటిమెంట్‌ను కొనసాగించడంలో సహాయపడుతుంది.
ప్రస్తుతం వడ్డీ రేట్లు..
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్): 7.1 శాతం
సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సీఎస్ఎస్: 8.2 శాతం
సుకన్య సమృద్ధి యోజనా పథకం(ఎస్ఎస్‌వై: 8.2 శాతం
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ): 7.7 శాతం
కిసాన్ వికాస్ పత్ర: 7.5 శాతం
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్: 7.4 శాతం
ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్: 6.9 శాతం
రెండేళ్ల ఎఫ్‌డీ: 7.0 శాతం
మూడేళ్ల ఎఫ్‌డీ: 7.1 శాతం
ఐదేళ్ల ఎఫ్‌డీ: 7.5 శాతం
ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్: 6.7 శాతం
Read More... ఫిబ్రవరి 1 నుంచి భారీగా పెరగనున్న సిగరెట్, పాన్ మసాలా ధరలు






