ఫిబ్రవరి 1 నుంచి భారీగా పెరగనున్న సిగరెట్, పాన్ మసాలా ధరలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-01 08:40:25  IST  )

కొత్త ఏడాదిలో సిగరెట్, పాన్ మలాసా ప్రియులకు కేంద్రం షాకిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి వీటి ధరలు భారీగా పెరగనున్నాయి.

ఫిబ్రవరి 1 నుంచి భారీగా పెరగనున్న సిగరెట్, పాన్ మసాలా ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ఏడాదిలో సిగరెట్, పాన్ మలాసా ప్రియులకు కేంద్రం షాకిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. సిగరెట్, పాన్ మసాలాపై 40 శాతం జీఎస్టీ, బీడీలపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ పెంపుతో పాటు.. పొగాకు సంబంధిత ఉత్పత్తులకు అదనంగా ఎక్సైజ్ సుంకం విధించింది. ఇవి కూడా ఫిబ్రవరి1 నుంచి అమల్లోకి రానున్నది. తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించవలసి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025

పాన్ మసాలా తయారీపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించేలా పార్లమెంట్ రెండు బిల్లుల్నీ గత డిసెంబర్ నెలలో ఆమోదించింది. హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025కు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వీటి ద్వారా వచ్చే నిధులను ప్రజా ఆరోగ్యం కోసం, జాతీయ భద్రతా బలోపేతానికి ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

Read More... Small savings schemes: మరోసారి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథం

Next Story