- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold Rate: వామ్మో.. గోల్డ్@96000..! మొన్న ఎవడో బంగారం ధర రూ.55,000కి పడిపొద్ది అన్నాడు.. నరి*కేయాలాడ్ని!
Gold Rate: బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఆటం బాంబులా పేలిపోతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: Gold Rate: బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఆటం బాంబులా పేలిపోతున్నాయి. తులం 55వేలకు పడిపోతుందన్న అంచనాలు కాస్త తలక్రిందులు అయ్యేలా ఉన్నాయి. లక్ష టార్గెట్ గా దూసుకుపోతున్నాయి. ఒక్కసారిగా తులం బంగారం ధర రూ 96వేలు చేరుకోవడంతో పసిడి ప్రియుల్లో ఆందోళన మొదలైంది. గత మూడు రోజుల్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. పెరుగుతున్న స్పీడ్ చూస్తుంటే లక్షను దాటేలా కనిపిస్తోంది.
గత వారం బంగారం ధరలు భారీగా తగ్గినట్లే కనిపించింది. ఏప్రిల్ 7, 8వ తేదీల్లో దాదాపు 1000 రూపాయల వరకు తగ్గింది. ఇప్పుడైనా తులం కొందామని ప్లాన్ చేసుకునే లోపే మళ్లీ బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే బంగారం ధరలు ఎంత పెరిగినా..కొందరు మాత్రం తగ్గడం కష్టమే అంటూ కొనేస్తున్నారు. డబ్బు ఉన్నోళ్లకు ధర పెరుగుదలతో సంబంధం ఉండదు. కానీ మరికొందరు మాత్రం బంగారం ధరలు భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉందని.. ఇప్పుడే కొని పెట్టుకోవడం మంచిది అనుకుంటున్నారు. అయితే గత మూడు రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో చూద్దాం.
ఏప్రిల్ 8వ తేదీన విజయవాడ, హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89, 730 ఉంది. ఈ మూడు రోజుల్లో ఏకంగా రూ. 5, 670 పెరిగింది. ప్రస్తుతం 24క్యారెట్ల బంగారం ధర రూ. 96వేలకు చేరుకుంది. అంటే ఈ మూడు రోజుల్లో గ్రాము బంగారానికి రూ. 567 వరకు పెరిగింది. నిన్న ఒక్కరోజే తులానికి 2020 రూపాయలు పెరిగింది.
ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గత మూడు రోజుల క్రితం తులం బంగారం రూ. 82,250 ఉంది. మూడు రోజుల్లో 5200 రూపాయలు పెరిగింది. ఈ మూడురోజుల్లోనే గ్రాము బంగారం ధర రూ. 520 పెరిగింది. నిన్న ఒక్కరోజే రూ. 1850 పెరిగింది.
అంతర్జాతీయ ఉద్రిక్తతలతో బంగారం ధర నేడు దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధఱ రూ. 96,450కి చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రూ. 96,430 పలుకుతోంది. వెండి కిలో 95,550 ఉంది.
Read more : Post Office Scheme: ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ.9,250.. ఈ స్కీమ్ వడ్డీ రేట్లు, ప్రయోజనాలు ఇవే!
5ఏళ్ల మీ కూతురి కోసం ఇలా పెట్టుబడి పెట్టండి.. ఆమె భవిష్యత్‌క ఢోకా ఉండదు!
రిస్క్ లేకుండా గ్యారెంటీ రాబడి పొందే మార్గం..రూ.5000తో రూ.1 కోటి మీ సొంతం






